1945 movie: క్లైమాక్ లేకుండానే 1945 మూవీ.. మరో వివాదంలో రానా?

1945 movie: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ పోస్టుపోన్ కావడంతో ఈ సంక్రాంతి సీజన్ ను వినియోగించుకునేందుకు చిన్న సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఇదే సమయంలో ఎక్కడెక్కడో మూలనపడిన సినిమాలు సైతం సందేట్లో సడేమియాగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అలాంటి సినిమానే గతంలో రానా హీరోగా నటించిన ‘1945’ మూవీ. నాలుగేళ్ల క్రితం ‘1945’ మూవీని దర్శకుడు శివ తెరకెక్కించాడు. అయితే నిర్మాతకు, హీరో మధ్య మనస్పర్థలు రావడంతో ఈ సినిమా మధ్యలోనే అర్ధాంతరంగా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే […]

Written By: Raghava Rao Gara, Updated On : January 8, 2022 12:15 pm
Follow us on

1945 movie: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ పోస్టుపోన్ కావడంతో ఈ సంక్రాంతి సీజన్ ను వినియోగించుకునేందుకు చిన్న సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఇదే సమయంలో ఎక్కడెక్కడో మూలనపడిన సినిమాలు సైతం సందేట్లో సడేమియాగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అలాంటి సినిమానే గతంలో రానా హీరోగా నటించిన ‘1945’ మూవీ.

నాలుగేళ్ల క్రితం ‘1945’ మూవీని దర్శకుడు శివ తెరకెక్కించాడు. అయితే నిర్మాతకు, హీరో మధ్య మనస్పర్థలు రావడంతో ఈ సినిమా మధ్యలోనే అర్ధాంతరంగా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఈ మూవీ జనవరి 7న రిలీజు అవుతుందని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ఈ మూవీకి తనకు ఏమి సంబంధం లేదని హీరో రానా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

అసలు పూర్తికానీ ఈ సినిమాను ఇప్పుడెందుకు రిలీజు చేస్తున్నారో అర్థంకావడం లేదని రానా ట్వీట్ చేయడంపై నిర్మాత మండిపడ్డారు. సినిమా పూర్తయిందో లేదో దర్శకుడు చూసుకుంటాడులే అంటూ రానాకు కౌంటర్ ఇచ్చాడు. దీనికి రానా సైతం థ్యాంక్స్ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా విషయంలో వీరిమధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.

ఈ ఇష్యూపై దర్శకుడు శివ స్పందిస్తూ హీరో, నిర్మాతల మధ్య ఏదైనా సమస్య ఉంటే మీరు మీరు చూసుకోవాలని, తన కెరీర్ ను దెబ్బతియద్దని విజ్ఞప్తి చేశాడు. అయితే ఇదంతా జరిగి రెండేళ్లు అవుతుండగా నిన్న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో స్టార్ క్యాస్ట్ బాగానే ఉంది. అయితే వీరిని దర్శకుడు సరిగ్గా వాడుకోకపోవడం మైనస్ గా మారింది.

ఈ సినిమాలో బలమైన సీన్స్ ఒక్కటి కూడా లేదు. దీంతోపాటు సినిమా పూర్తి కాకపోవడంతో పలుమార్పులు చేసి క్లైమాక్స్ లేకుండానే ముగించినట్లు కన్పిస్తోంది. దీంతో రానా చెప్పిన మాటలే చివరికి నిజమయ్యాయని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా క్లైమాక్స్ లేకుండా సినిమా తీయడం ఏంటని పలువురు సీనిప్రియులు మండిపడుతున్నారు.