Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని ఆర్ధిక పరిస్థితుల కారణంగా అర్థాంతరంగా వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం అసలు ఇప్పట్లో విడుదల అవుతుందా?, సంక్రాంతికి వాయిదా పడుతుందా? , లేదంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రం లాగా అనేక సార్లు వాయిదా పడుతూ పాత సినిమా ఫీలింగ్ ని కలిగిస్తుందా అనే భయం తో ఉండేవారు అభిమానులు. కానీ ఈ చిత్రానికి ఉన్న అతి పెద్ద సమస్యలు మొత్తం తీరిపోయాయి. ఈ నెల 12 న విడుదల చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈరోజే విడుదల తేదీ పై అధికారిక ప్రకటన వస్తుందని అంతా అనుకున్నారు కానీ, ఎందుకో ఈరోజు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రేపటి లోపు విడుదల తేదీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకవేళ ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల అయ్యుంటే 17 సినిమాలకు ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. అందులో 14 కొత్త సినిమాకు, 3 రీ రిలీజ్ చిత్రాలు ఉన్నాయి. కొత్త సినిమాల్లో యాంకర్ సుమ కొడుకు రోషన్ నటించిన ‘మోగ్లీ’, తమిళ హీరో కార్తీ నటించిన ‘అన్నగారు వస్తారు’, మరియు ‘డ్రైవ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 12 న వస్తుందని విడుదల అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆ చిత్రం డిసెంబర్ 25 న కానీ, లేకపోతే డిసెంబర్ 19 న కానీ విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ ‘అఖండ 2’ మేకర్స్ అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఇకపోతే ‘అఖండ 2 ‘ ప్రొమోషన్స్ విషయానికి వస్తే డిసెంబర్ 5 న ఈ సినిమా విడుదల అవ్వబోతుంది అని అనుకున్న సమయం లోనే మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ ఒక రేంజ్ లో కుమ్మేసింది.
హీరో నందమూరి బాలకృష్ణ అయితే ఏకంగా హిందీ ఇంటర్వ్యూస్ కూడా నాన్ స్టాప్ గా ఇచ్చాడు. అవి బాగా వైరల్ అయ్యాయి, కాబట్టి ప్రత్యేకంగా ఈ సినిమాకు ప్రొమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. విడుదలకు ముందు కేవలం ఒక ప్రెస్ మీట్ ని మాత్రమే ఏర్పాటు చేస్తారట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ జనరల్ ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ని క్రియేట్ చేయలేకపోయింది. కేవలం బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ సినిమా కాబట్టి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. పైగా విడుదల వాయిదా పడడంతో నందమూరి ఫ్యాన్స్ లో మంచి కసి కూడా పెరిగింది. చూడాలి మరి ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.