Dragon: ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై యూత్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించిన చిత్రాల్లో ఒకటి ‘డ్రాగన్'(Dragon Movie). తెలుగు లో ఈ చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon) అనే పేరుతో విడుదల చేసారు. తమిళం లో ఈ చిత్రం ఎంత పెద్ద అయ్యిందో, తెలుగు లో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నిన్న, మొన్న అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వచ్చిన వసూళ్లకంటే ఎక్కువ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం మీద 10 రోజులకు గాను ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా 15 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. అదే విధంగా డిస్ట్రిక్ట్ యాప్, పేటీఏం కలిపి మొత్తం ఆన్లైన్ టికెట్ సేల్స్ పాతిక లక్షల టికెట్స్ సేల్ అయ్యాయని అంచనా వేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలలో ఇది ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు.
Also Read: అసలు ఈ అనోరా మూవీలో ఏముంది? ఎందుకు ఆస్కార్ పంట పండించింది?
శివకార్తికేయన్(Sivakarthikeyan) నటించిన ‘అమరన్’ చిత్రానికి ఇంతకు మించి రెండు రెట్లు ఎక్కువ టికెట్ సేల్స్ జరిగాయి కానీ అది బయోపిక్ అవ్వడం తో ప్రత్యేకమైన క్యాటగిరీలో చేర్చారు విశ్లేషకులు. అంత్య్ కాకుండా విడుదలకు ముందు కూడా ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండేవి. కానీ ‘డ్రాగన్’ చిత్రం పై అలాంటి అంచనాలు ఏమి లేవు. ఒక సాధారణ సినిమాగా విడుదలై, కంటెంట్ వేరే లెవెల్ లో ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషలకు కలిపి పది రోజులకు గాను 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) మొదటి చిత్రం ‘లవ్ టుడే’ కి కూడా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడు రెండవ చిత్రం కూడా ఆ క్యాటగిరీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తమిళ నాడు లో స్టార్ హీరోలకే ఈమధ్య కాలంలో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం అతి కష్టం గా మారింది. ఆ జాబితాలో విక్రమ్, సూర్య వంటి వారు ఉన్నారు. అలాంటి రోజులు నడుస్తున్న ఈ కీలక సమయంలో కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి రెండు సినిమాలతో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇదే ఊపులో ప్రదీప్ దూసుకుపోతే, అతి త్వరలోనే ఆయన యూత్ ఐకాన్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డైరెక్టర్ గా, హీరోగా, స్టోరీ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా ప్రదీప్ రంగనాథన్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. రాబోయే రోజుల్లో ఈయన ఇంకా ఏ స్థాయికి చేరుకుంటాడో చూడాలి.
Also Read: ‘సలార్ 2’ లో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఆ రేంజ్ లో చూపించబోతున్నాడా..?