Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ప్రొమోషన్స్ లో నిర్మాత దిల్ రాజు ప్రతీ ఈవెంట్ లోనూ కేవలం పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేసాము అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ సినిమాల్లో పాటలకు ఆ రేంజ్ భారీ తనం ఉంటుంది అనేది మనమంతా ముందుగా ఊహించిందే. మన ఊహలకు తగ్గట్టుగానే శంకర్ ఈ చిత్రం లోని పాటలను అద్భుతంగా చిత్రీకరించాడు. ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ ఫస్ట్ హాఫ్ లో అదిరిపోయింది. రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్స్ లతో పాటు, స్క్రీన్ ప్రెజెన్స్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా ‘డోప్’ సాంగ్, కోపరాప్ సాంగ్స్ లో కూడా శంకర్ మార్క్ కనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చే ‘జరగండి’ సాంగ్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ‘నానా హైరానా’ పాటని సినిమా నుండి తొలగించడం అభిమానులను తీవ్రమైన నిరాశకు గురయ్యేలా చేసింది.
ఈ పాటని ఇన్ఫ్రారెడ్ కెమెరా తో చిత్రీకరించామని డైరెక్టర్ శంకర్ అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎవ్వరూ ఈ కెమెరా ని ఉపయోగించలేదని, ఈ కెమెరా నుండి వచ్చే ఔట్పుట్ ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం చాలా పెద్ద సాహసం అని చెప్పుకొచ్చాడు. అయితే ఫైనల్ ఔట్పుట్ లో శంకర్ ఆశించిన స్థాయి ఔట్పుట్ ప్రింట్స్ లో కనిపించకపోవడంతో ప్రస్తుతానికి ఈ పాటని ఎడిటింగ్ లో తొలగించారని తెలుస్తుంది. మళ్ళీ ఈ పాటని 14 వ తేదీ నుండి జత చేస్తారని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని చూసిన కొంతమంది ఆడియన్స్ చెప్తున్నది ఏమిటంటే, ఈ పాట ని సినిమాకి జత చేయకపోవడమే మంచిది అని. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో అప్పన్న క్యారక్టర్ ముగిసిన తర్వాత స్టోరీ పెద్దగా లేకపోయినా స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉందని. ఈ పాట జత చేస్తే జనాలకు ల్యాగ్ చేసిన అనుభూతి కలుగుతుందని అంటున్నారు.
వాస్తవానికి యూట్యూబ్ లో అన్ని పాటలకంటే ఈ పాటకే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంస్టాగ్రామ్ లో కూడా ఈ పాట మీదనే అత్యధిక రీల్స్ వచ్చాయి. అలాంటి పాటని తొలగించడం పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ కెమెరా నుండి తీసే స్నాప్ షాట్స్ X రే ఫొటోలతో సమానంగా వస్తాయి. కొన్ని కలర్స్ అందులో చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. కేవలం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఇలాంటి కెమెరాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి కెమెరాతో ఒక పాటని చిత్రీకరించడం సాహసం అనే చెప్పాలి. 14 వ తేదీన ఈ సాంగ్ ని జత చేసిన తర్వాత ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.