The Legend Of Hanuman: ఆదిపురుష్ కంటే 100 రెట్లు బెటర్.. అసలేంటి ‘హనుమాన్’ సిరీస్..? ఏంటా కథ..?

రామాయణం కథ తోనే ఇప్పుడు వరుస సినిమాలు వస్తున్నాయి. ఓవైపు నితీష్ తివారి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఒక భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే హనుమాన్ అనే టైటిల్ తో ఒక యానిమేటెడ్ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది.

Written By: Gopi, Updated On : December 25, 2023 1:44 pm

The Legend Of Hanuman

Follow us on

The Legend Of Hanuman: పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ హీరోగా ఓం రావత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుషు సినిమా రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కింది. ఇక ఈ సినిమా చాలా విమర్శలను ఎదుర్కొంది. ఇక రామాయణంలో ఉండే ప్రతి పాత్రకి ఉండే హావభావాలను చాలా సిల్లీగా తెరకెక్కించాడంటూ దర్శకుడు ఓం రావత్ పైన విమర్శలు విపరీతంగా వచ్చాయి. ఆ దెబ్బకి తను అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమాని ఇంత నిర్లక్ష్యం గా తీయడం పట్ల ప్రేక్షకులతో పాటు, విమర్శకులు అలాగే అభిమానులు కూడా విపరీతంగా ట్రోల్ చేశారు…

అయితే రామాయణం కథ తోనే ఇప్పుడు వరుస సినిమాలు వస్తున్నాయి. ఓవైపు నితీష్ తివారి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఒక భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే హనుమాన్ అనే టైటిల్ తో ఒక యానిమేటెడ్ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ఆనిమేటెడ్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. యానిమేషన్లు కొత్త తరహా పద్ధతులను వాడుతూ వీళ్ళు తెరకెక్కించిన విధానం ప్రతి ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాగే యానిమేషన్ లో ఉన్న క్వాలిటీ కూడా సగటు ప్రేక్షకుల్లో ఈ ట్రైలర్ చూడ్డానికి గల మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది…

ఇక ఇందులో బలవంతుడైన హనుమంతున్ని పీక్స్ లెవెల్లో చూపించినట్టుగా తెలుస్తుంది. అలాగే రావణుడి పాత్రకి డబ్బింగ్ చెప్పిన శరత్ కెల్కర్ వాయిస్ హైలెట్ గా నిలుస్తుంది. హనుమంతుడు యొక్క పరాక్రమాన్ని చేస్తూ ఈ ట్రైలర్ లో ఆయన మీదే ఎక్కువ ఫోకస్ చేసి ట్రైలర్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆనిమేటెడ్ మూవీ గా వస్తున్న ఈ సినిమా ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024 సంవత్సరంలో రిలీజ్ కి రెడీ అవుతుంది…అయితే ఇది ఒక సీరీస్ గా రూపొంది ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందడానికి పండగ కి మన ముందుకు వస్తుంది…

ప్రభాస్ ఆది పురుషు సినిమా వచ్చిన తర్వాత రామాయణాన్ని బేస్ చేసుకొని చాలా సినిమాలు వస్తున్నాయి ఇదిలా ఉంటే తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఆనిమేటెడ్ మూవీ వాళ్లు వాడిన టెక్నాలజీని ఉద్దేశిస్తూ ఆది పురుషు సినిమాని కంపేర్ చేస్తూ ఆది పురుషు సినిమా కంటే కూడా ఈ సినిమాలో అనిమేషన్ సీన్స్ చూడ్డానికి చాలా బాగున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు…