Pawan Kalyan Remuneration: పాన్ ఇండియా మార్కెట్ లేకుండా 100 కోట్లు.. ఎవ్వరు అందుకోలేని రేంజ్ కి పవన్ కళ్యాణ్

Pawan Kalyan Remuneration: ప్రస్తుతం మన తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతీ స్టార్ హీరో తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసుకునే స్థాయికి ఎదిగారు. బాహుబలి సిరీస్ మరియు #RRR తర్వాత మన స్థాయి టెక్నికల్ గా మరియు మార్కెట్ పరంగా బాలీవుడ్ హీరోలు సైతం అందుకోలేని రేంజ్ కి వెళ్ళింది.అయితే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో పాన్ ఇండియన్ సినిమాలు చెయ్యని హీరోలు ఎవరైనా ఉన్నారా […]

Written By: Vicky, Updated On : June 1, 2023 3:59 pm

Pawan Kalyan Remuneration

Follow us on

Pawan Kalyan Remuneration: ప్రస్తుతం మన తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతీ స్టార్ హీరో తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసుకునే స్థాయికి ఎదిగారు. బాహుబలి సిరీస్ మరియు #RRR తర్వాత మన స్థాయి టెక్నికల్ గా మరియు మార్కెట్ పరంగా బాలీవుడ్ హీరోలు సైతం అందుకోలేని రేంజ్ కి వెళ్ళింది.అయితే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో పాన్ ఇండియన్ సినిమాలు చెయ్యని హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.

టాలీవుడ్ టాప్ 2 హీరోలు గా ప్రసిద్ధి గాంచిన ఈ ఇద్దరు హీరోలు, ఇప్పుడు కేవలం టాలీవుడ్ మార్కెట్ కి పరిమితం అయిపోయారు. వీళ్ళ తదుపరి చిత్రాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే అయినా ప్రస్తుతానికి వీళ్ళ మార్కెట్ అల్లు అర్జున్ , రామ్ చరణ్ మరియు ప్రభాస్ కంటే తక్కువే ఉంటుంది.

అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ‘హరి హర వీరమల్లు’ కాగా మరొకటి ‘#OG’.ఈ రెండు సినిమాలలో #OG చిత్రానికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అటు ఫ్యాన్స్ లో కానీ ఇటు ఆడియన్స్ లో కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెర మీద చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఏకంగా వంద కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడట.

ఇప్పటి వరకు సింగల్ లాంగ్వేజ్ మార్కెట్ తో ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ మాత్రమే. వాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ #OG సినిమా హిట్ అయితే ఆయన రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఊహాతీతం అనే విధంగా ఉంటుంది. డిసెంబర్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా , ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.