PKSDT Bro Movie Recards: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే, అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కానీ, ‘బ్రో’ అనే చిత్రం మాత్రం మామూలు సినిమా. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు, ఆయనతో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. తమిళం లో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న ‘వినోదయ్యా చిత్తం’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇండియా లోనే అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. జులై 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అప్పుడే అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు సీడెడ్ ప్రాంతానికి కలిపి ఈ చిత్రానికి దాదాపుగా 55 కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.అలాగే నైజాం ప్రాంతం లో 30 కోట్లు మరియు కర్ణాటక , ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 15 కోట్లు, మొత్తం మీద 100 కోట్ల రూపాయిల బిజినెస్ ని ఈ చిత్రం జరుపుకుంటున్నట్టు సమాచారం. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త అభిమానులను కలవర పెడుతుంది.
అదేమిటి అంటే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కేవలం 15 నిముషాలు మాత్రమే కనిపిస్తాడని, ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఇదే విషయం కనుక నిజమైతే మేకర్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.మరి దీనికి మేకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోయే రోజుల్లో రాబోతున్నాయి.