IMDB Rated Top 10 Movies: ఓటీటీ సంస్థలు ప్రేక్షకులకు విభిన్నమైన కంటెంట్ అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు పట్టణాల వరకే ఓటీటీ సంస్థల ప్రభావం ఉండేది. ఇప్పుడు అది పల్లెలకు కూడా పాకింది. ఓటీటీలో సినిమాలు చూసే ఆడియన్స్ సంఖ్య పెరిగింది. ఇక నేరుగా ఓటీటీ లో విడుదలై అత్యధిక ఐఎండీబీ రేటింగ్ పొందిన చిత్రాలు ఏమిటో? వాటిని ఏ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో చూడోచ్చో తెలుసుకుందాం..
1. జై భీమ్
హీరో సూర్య నటించిన సామాజిక చిత్రం జై భీమ్. పేదవాళ్ల మీద పోలీసులు, చట్టం పాల్పడుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకకంగా ఈ చిత్రం తెరకెక్కింది. జై భీమ్ మూవీకి 8.7 ఐఎండీబి రేటింగ్ దక్కింది. అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు.
2.సర్ పట్టా పరంబరై
హీరో ఆర్య నటించిన ఈ చిత్రం బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో నటుడు పశుపతి కీలక రోల్ చేశాడు. ఈ చిత్రానికి 8.5 ఐఎండీబీ రేటింగ్ దక్కింది. సర్ పట్టా పరంబర్తె అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.
3. దృశ్యం 2
సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 2 నేరుగా ఓటీటీ లో విడుదల చేశారు. మోహన్ లాల్, మీనా జంటగా నటించారు. ఈ సినిమాకు 8 .4 ఐఎండీబీ రేటింగ్ దక్కింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.
4. సర్దార్ ఉద్ధమ్
నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సర్దార్ ఉద్ధమ్. ఇది ఓ బయోపిక్. ఈ మూవీని నేరుగా ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ చిత్రం 8 .4 ఐఎండీబీ రేటింగ్ పొందింది.
5. అమర్ సింగ్ చమ్కీలా
దిల్జిత్ దోసాన్జ్, పరిణీతి చోప్రా జంటగా నటించిన చిత్రం అమర్ సింగ్ చమ్కీలా. ఈ మూవీకే ఐఎండీబీ సంస్థ 8.1 రేటింగ్ ఇచ్చింది. నెట్ఫ్లిక్స్ లో నేరుగా విడుదల చేశారు.
6. మహాన్
విక్రమ్, సిమ్రాన్, ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మహాన్. ఈ మూవీ నేరుగా ప్రైమ్ లో విడుదలైంది. ఈ చిత్రం 7.6 ఐఎండీబీ రేటింగ్ సాధించింది.
7.గుల్ మొహర్
షర్మిలా ఠాకూర్, మనోజ్ పాజ్ పాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గుల్ మొహర్. ఈ మూవీకి ఐఎండీబీ సంస్థ 7.6 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో చూడొచ్చు.
8. ఖో గయే హమ్ కహాన్
యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఖో గయే హమ్ కహాన్ మూవీ నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. లైగర్ ఫేమ్ అనన్య పాండే నటించింది. ఈ చిత్రానికి ఐఎండీబీ సంస్థ 7. 4 రేటింగ్ ఇచ్చింది.
9. ఏకే వర్సెస్ వీకే
అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఏకే వర్సెస్ వీకే. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఈ చిత్రానికి ఏఎండీబీ సంస్థ 6.9 రేటింగ్ ఇచ్చింది.
10. అత్రాంగి రే
అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అత్రాంగి రే. ఈ మూవీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు. అత్రాంగి రే మూవీకి 6.5 ఐఎండీబీ రేటింగ్ దక్కింది.