
దేవసేన అనుష్క శెట్టి తొలిసారి విజయ్ సరసన నటించబోతోందట. విజయ్ అంటే మన విజయ్ దేవరకొండ అనుకుంటున్నారా? కాదు. తమిళ్ సీనియర్ హీరో విజయ్ సేతుపతి. విలక్షణ నటనతో సౌతిండియాలో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోయే సేతుపతి ఖాతాలో ఇప్పుడు చాలానే సినిమాలు ఉన్నాయి. డేట్స్ అడ్జస్ట్ చేయలేక అల్లు అర్జున్ ‘పుష్ప’ నుంచి తప్పుకున్నాడు. అతను విలన్‌గా.. తలపతి విజయ్ మూవీ ‘మాస్టర్’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో ‘లాల్‌సింగ్ చద్దా’ మూవీలో సేతుపతి ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అతనికి ఇదే ఫస్ట్ మూవీ.
Also Read: ‘రొమాంటిక్’ బ్యూటీతో నాగశౌర్య రొమాన్స్!
తాజాగా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించే కొత్త సినిమాలో విజయ్ లీడ్ రోల్ పోషించనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని తీసుకున్నారని సమాచారం. అదే నిజమైతే.. అనుష్క, సేతుపతి ఫస్ట్ టైమ్ జోడీ కట్టనున్నారు. ఈ మూవీని వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఇషారి గణేశ్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఏఎల్ విజయ్‌తో కలిసి అనుష్క గతంలో ‘దైవ తిరుమగల్’, ‘తాండవం’ అనే రెండు తమిళ సినిమాల్లో కలిసి పని చేసింది. మరోవైపు తాను లీడ్ రోల్ పోషించిన ‘నిశ్శబ్దం’ రిలీజ్ కోసం అనుష్క ఎదురు చూస్తోంది. ఈ మూవీపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్లోనే మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా… లాక్‌డౌన్ కారణంగా అది కుదరలేదు. ఓటీటీల నుంచి ఆఫర్లు వస్తున్నా.. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా అంటున్నారు ప్రొడ్యూసర్స్. థియేటర్లు తిరిగి ప్రారంభమైతే కానీ ‘నిశ్శబ్దం’ రిలీజయ్యేలా లేదు. మరోవైపు బాహుబలి తర్వాత ఈ మూవీకి కమిటైన అనుష్క మరే కథకు ఓకే చెప్పలేదు. ఎన్నో ఆఫర్లు వరుస కడుతున్నా.. నిశ్శబ్దం విడులయ్యే వరకూ కమిట్మెంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఏఎల్ విజయ్ మంచి కథతో ఆమెను ఇంప్రెస్ చేశాడట.ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అనౌన్స్‌మెంట్ రావొచ్చు.