Homeఎంటర్టైన్మెంట్'పుష్ప' కోసం దిగజారిపోయిన బన్నీ !

‘పుష్ప’ కోసం దిగజారిపోయిన బన్నీ !

ఈ మధ్య సినిమా వాళ్ళ లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు మా సినిమా వంద రోజులు ఆడింది, రెండు వందల రోజులు ఆడింది అంటూ రికార్డ్స్ గురించి చెబుతూ అవే మాకు ప్రేక్షకులు ఇచ్చిన అవార్డ్స్ అంటూ తెగ మురిసిపొయ్యేవాళ్ళు. కానీ, డిజిటల్ విప్లవం వచ్చిన తరువాత, మా టీజర్ కి ఇన్ని గంటల్లో ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి, మా ట్రైలర్ కి ఏభై అరవై మిలియన్ల వ్యూస్ వచ్చాయి అంటూ అదే అన్నిటికి కంటే రికార్డ్స్ అంటూ పోస్టర్స్ వదులుతున్నారు.

అయితే, ఒక సినిమాకి ఉన్న క్రేజ్ ను బట్టే కదా వ్యూస్ వచ్చేది, కాబట్టి ఫలానా సినిమా టీజర్ కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి, కచ్చితంగా ఆ సినిమాకి దక్కిన రికార్డే అని ప్రేక్షకులు కూడా ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చారు. కానీ ఆ నమ్మకాల వెనుక దిగజారిన ఆలోచన ఉందని, రికార్డ్ వ్యూస్ వెనుక బోగస్ ప్లానింగ్ ఉందని ప్రేక్షక లోకానికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది.

ముఖ్యంగా యూట్యూబ్ లో టీజర్లకు, ట్రైలర్లకు వ్యూస్ కొనడం అనేది కామన్ అయిపోయిందని ఇప్పుడున్న వస్తోన్న రికార్డ్ వ్యూస్ అన్నీ అదే బాపతు అని ఆడియన్స్ కూడా తెలుసుకుంటున్నారు. అయినా ఫస్ట్ డే మిలియన్ల కొద్దీ వ్యూస్ ఎందుకు వస్తాయి ? ఎంత గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమా అయితే ఏం ? వ్యూస్ విచ్చలవిడిగా రావాలంటే కష్టమే. అందుకే వ్యూస్ కొనుక్కునే మార్కెటింగ్ ట్రిక్కులు తప్పడం లేదు. అందుకే స్టార్ హీరోలు కూడా పోటీ పడి వ్యూస్ కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

లేకపోతే ‘పుష్ప’ టీజర్ చాలా రోజులుగా 45 మిలియన్ల వ్యూస్ దగ్గర కొట్టుమిట్టాడతా ఉంది. రోజులు గడుస్తున్నా వ్యూస్ పెరగలేదు. కానీ అంతలో ‘అఖండ’ టైటిల్ టీజర్ 47 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయే సరికి, పుష్ప టీజర్ కేవలం రెండు రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది. వారాలు గడుస్తోన్నా రాని వ్యూస్, కేవలం రెండు రోజుల్లోనే ఎలా వచ్చాయి ? వ్యూస్ కొనుక్కోవడం అనే ట్రిక్ ఉందని ఈజీగా అర్ధమైపోతుంది. పుష్ప కోసం బన్నీ ఇలా దిగజారిపోవడం బాధాకరమైన విషయం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version