https://oktelugu.com/

Pooja Hegde : నయనతారకే షాకిచ్చిన బుట్టబొమ్మ.. విషయం తెలిస్తే

Pooja Hegde : సినిమా ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. ఎవ‌రి కెరీర్ ఎప్పుడు.. ఎలా ట‌ర్న్ తీసుకుంటుందో ఎవ్వ‌రూ అంచ‌నా వేయ‌లేరు. చినుకులా వ‌చ్చిన వారు సునామిలా చెల‌రేగిపోతారు. తుఫానులా ఎంట‌రైన‌వారు వెంట‌నే నీరుగారిపోతారు. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తుంది. ‘ముకుంద‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూజాహెగ్డే.. తొలి సినిమాతో యావ‌రేజ్ స‌క్సెస్ నే అందుకుంది. ఆ త‌ర్వాత చేసిన కొన్ని సినిమాలు కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. […]

Written By:
  • Rocky
  • , Updated On : September 18, 2021 / 12:27 PM IST
    Follow us on

    Pooja Hegde : సినిమా ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. ఎవ‌రి కెరీర్ ఎప్పుడు.. ఎలా ట‌ర్న్ తీసుకుంటుందో ఎవ్వ‌రూ అంచ‌నా వేయ‌లేరు. చినుకులా వ‌చ్చిన వారు సునామిలా చెల‌రేగిపోతారు. తుఫానులా ఎంట‌రైన‌వారు వెంట‌నే నీరుగారిపోతారు. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తుంది. ‘ముకుంద‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూజాహెగ్డే.. తొలి సినిమాతో యావ‌రేజ్ స‌క్సెస్ నే అందుకుంది. ఆ త‌ర్వాత చేసిన కొన్ని సినిమాలు కూడా పెద్ద‌గా ఆడ‌లేదు.

    ప‌డుతూ లేస్తూ సాగిన పూజా కెరీర్.. మ‌హేష్ బాబుతో మ‌హ‌ర్షి, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో అర‌వింద స‌మేత వంటి చిత్రాల‌తో జోరందుకుంది. ఇక‌, బ‌న్నీతో వ‌చ్చిన ‘అల‌వైకుంఠ పుర‌ములో’ సాధించిన భారీ బ్లాక్ బస్టర్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తో రాబోతున్న ప్రేమకావ్యం ‘రాధేశ్యామ్’, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లోనూ ఈ భామ సందడి చేయబోతోంది. ఇందులో ఏ ఒక్కటి హిట్ కొట్టినా.. ఆ లెక్క వేరేగా ఉండ‌నుంది.

    అయితే.. ఇప్పుడు విష‌యం ఏమంటే.. ఈ అమ్మ‌డి జోరుకు స్టార్ హీరోయిన్ల పునాదులు క‌ద‌లిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్ లో ఏ ఇండ‌స్ట్రీలోనైనా హీరోయిన్ 2 కోట్ల‌ రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుందంటే.. అదో సంచ‌ల‌న‌మే. అలాంటి చోట స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ఏకంగా 4 కోట్ల రూపాయ‌ల పారితోషికం తీసుకుంటూ స‌త్తా చాటుతోంది.

    ఇప్పుడు ఈ బ్యూటీని ఓవ‌ర్ టేక్ చేసేప‌డేసింది పూజా హెగ్డే. త‌మిళ్ స్టార్ విజ‌య్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టిస్తోంది పూజా. బీస్ట్ పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మైండ్ బ్లాక్ చేసే రెమ్యున‌రేష‌న్ ఫిక్స్ చేసుకుందీ బుట్ట‌బొమ్మ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోయిన్ అందుకోలేనంత రెమ్యున‌రేష‌న్ ఈ బ్యూటీ సొంతం చేసుకుంటోంద‌ని టాక్. ఈ చిత్రానికి గానూ ఏకంగా 5 కోట్ల రూపాయ‌ల పారితోష‌కం అందుకుంటోంద‌ని టాక్‌.

    ఈ బ్యూటీ త‌ర్వాత న‌య‌న తార 4 కోట్లతో రెండో స్థానంలో ఉండ‌గా.. ఆ త‌ర్వాత ప్లేసులో కీర్తి సురేష్ ఉన్నారు. నాలుగో ప్లేసులో ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఉన్నారు. మ‌రి, ఈ బీస్ట్ స‌క్సెస్ సాధించినా.. రాధేశ్యామ్ హిట్ కొట్టినా.. ఈ అమ్మ‌డి రేంజ్ మరో మెట్టు ఎక్కుతుంద‌న‌డంలో సందేహ‌మే లేన‌ట్టుగా క‌నిపిస్తోంది.