TRP Ratings : ఒకప్పుడు టీవీ యాడ్స్ లో కనిపించడం అంటే.. టీవీ షోలకు యాంకరింగ్ చేయడమంటే చిన్నతనంగా ఫీలయ్యేవారు సినీతారలు! ఫేడౌట్ అయిపోన వాళ్లు.. ఇండస్ట్రీలో అవకాశాలు లేనివాళ్లే బుల్లితెరకు డిమోషన్ లో వచ్చేస్తారనే అభిప్రాయం ఉండేది. అందుకే.. చాలా కాలంపాటు సినీతారలు టీవీవైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ.. పరిస్థితులు మారాయి. స్టార్ డమ్ ఉన్నవాళ్లకే ఎండార్స్ మెంట్స్ వస్తాయని, స్టార్ స్టేటస్ కంటిన్యూ చేసేవాళ్లకే బుల్లితెర హోస్టులుగా సెలక్ట్ చేస్తున్నారనే స్థితి వచ్చేసింది. దీంతో.. నిర్వాహకులు తమ షోలకు క్రేజ్ తెచ్చేందుకు సినీ స్టార్స్ ను యాంకర్లుగా తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు ద్వారా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మాస్టర్ చెఫ్ షోకు తమన్నా(Tamanna) హోస్టుగా ఉన్నారు. దీంతో.. టీఆర్పీ రేటింగ్స్ పై ఆసక్తి పెరిగింది. మరి గడిచిన వారంలో ఎవరి షో ఎలాంటి రేటింగ్స్ నమోదు చేసింది? గత షోలు ఎంత సంపాదించాయి? అన్నది చూద్దాం.
తెలుగు బుల్లి తెరపై ఏళ్ల తరబడి అద్భుతమైన రేటింగ్ నమోదు చేస్తున్న ఏకైక షో జబర్దస్త్. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ మల్లెమాల షో.. మిగిలిన షోలతో పోల్చి చూస్తే.. ఈ వారం కూడా మంచి రేటింగ్ నమోదు చేసింది. అయితే.. గత రేంజ్ తో పోలిస్తే కాస్త తగ్గినట్టు కనిపించింది. సిటీ ఏరియాల్లో ఈ షోకు 6.45 రేటింగ్ రాగా.. గ్రామీణ ప్రాంతాల్లో 6.49 రేటింగ్ నమోదు చేసింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ రూరల్ లో 6.67 రేటింగ్ నమోదుచేయగా.. అర్బన్ ప్రాంతంలో 6.46 రేటింగ్ సాధించింది.
స్టార్ మాలో ప్రసారమవువుతున్న పలు షోలలో.. ఓంకార్ హోస్టుగా ఉన్న సిక్స్త్ సెన్స్ షోకు ఈ వారం గ్రామీణ ప్రాంతంలో 5.44, సిటీలో 4.78 రేటింగ్ వచ్చింది. స్టార్ కామెడీ షోకు తక్కువ రేటింగ్ వచ్చింది. గ్రామీణంలో 3.82, అర్బన్ లో 3.07 రేటింగ్ అందుకుంది.
ఇక, ఆరంభం నుంచీ ఎంతో క్రేజ్ సంపాదించిన ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు’’ షోకు రేటింగ్ మాత్రం ఊహించినంత మేర దక్కలేదు. కర్టన్ రైజర్ షోలో రామ్ చరణ్ (Ram charan) తో కలిసి ఎన్టీఆర్ హంగామా చేయడంతో ఆ ఒక్క రోజు మాత్రం 11 రేటింగ్ సాధించింది. కానీ.. ఓవరాల్ గా వారానికి వచ్చేసరికి ఆ రేటింగ్ 4.82కు పడిపోయింది. మరి, రానున్న రోజుల్లో ఏ స్థాయిలో నమోదు చేస్తుందో చూడాలి.
అటు హీరోయిన్ తమన్నా భాటియా హోస్టుగా వ్యవహరిస్తున్న షో ‘మాస్టర్ చెఫ్’. భారీ హంగూ ఆర్భాటాలతో నిర్మించిన సెట్ లో కొనసాగుతున్న వంటల ప్రోగ్రామ్ కు ఎన్టీఆర్ షోతో సమానమైన రేటింగ్ వచ్చింది. పాయింట్లలో మాత్రమే తగ్గింది. ఈ షోకు 4.64 శాతం రేటింగ్ వచ్చింది. అయితే.. ప్రస్తుతం తమన్నాకు ఉన్న స్టార్ స్టేటస్ తో కంపేర్ చేస్తే.. ఇలాంటి రేటింగ్ సాధించడం గొప్ప విషయమే అంటున్నారు. మొత్తానికి బుల్లితెరపై రేటింగ్ వార్ కొనసాగుతోంది. స్టార్లు హోస్టులుగా వస్తుండడంతో.. షోలకు క్రేజ్ పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ షోలు ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి.