కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ సమయాన్ని చక్కగా ఉపయోగించు కొంటూ తన సినిమా పనులు కానిచ్చేస్తున్నాడట… యంగ్ హీరో అడవి శేష్. ఇంతవరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేసిన అడవి శేష్ ఇప్పుడు ‘మేజర్’అనే దేశ భక్తి ప్రబోధాత్మక మూవీ చేస్తున్నాడు. సదరు చిత్రాన్ని మహేష్ బాబు స్వంత సంస్థ జీఎమ్బీ ( G M B ) ఎంటర్టైన్మెంట్స్ ‘గూఢచారి ఫేమ్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో నిర్మిస్తోంది . కాగా ‘మేజర్’ సినిమా ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. దాంతో ఇప్పటివరకు అయిన షూటింగ్ పార్ట్ ని ఎడిట్ చేస్తూ బిజీగా ఉన్నాడట ` మేజర్ ` చిత్ర హీరో అడవి శేష్..
‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సస్పెన్సు చిత్రాలతో విజయాలు అందుకున్న అడవి శేషు, ఇంతకుముందు `కర్మ `, ` కిస్ ` అనే రెండు సినిమాలను డైరెక్ట్ కూడా చేశాడు. ఆ అనుభవం తో తను నటించే ప్రతి సినిమాకు సంబంధించిన విషయాలన్ని దగ్గరుండి చూసుకుంటాడట …. ఆ క్రమంలో `మేజర్ ` చిత్రాన్ని కూడా దగ్గరుండి మరీ ఎడిటింగ్ చేయిస్తున్నాడు. 2008 లో ముంబై ఉగ్ర వాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన `మేజర్` సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘మేజర్’ మూవీ తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కు స్తున్నారు. అలాగే తమిళ్, మలయాళం భాషల్లో డబ్ చేయబోతున్నారు.