https://oktelugu.com/

మరో సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఈ ప్రాణాంతక వైరస్‌ కోరలు చాస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న దాడి చేస్తోంది. సాధారణ ప్రజలే కాదు రాజకీయ నాయకుడు, సెలెబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల, జర్నలిస్టులపై పంజా విసురుతోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని కరోనా కలవర పెడుతోంది. ప్రభుత్వం అనుమతించడంతో సినిమా, సీరియల్స్‌ షూటింగ్స్‌ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కరోనా వ్యాప్తికి అవే హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నటీనటులకు వైరస్‌ ప్రమాదం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 13, 2020 / 06:28 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఈ ప్రాణాంతక వైరస్‌ కోరలు చాస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న దాడి చేస్తోంది. సాధారణ ప్రజలే కాదు రాజకీయ నాయకుడు, సెలెబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల, జర్నలిస్టులపై పంజా విసురుతోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని కరోనా కలవర పెడుతోంది. ప్రభుత్వం అనుమతించడంతో సినిమా, సీరియల్స్‌ షూటింగ్స్‌ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కరోనా వ్యాప్తికి అవే హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నటీనటులకు వైరస్‌ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పలువురు టెలివిజన్‌ నటీనటులకు కరోనా సోకగా తాజాగా మరో నటుడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

    ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురుకూ కరోనా

    బుల్లితెర నటుడు, స్వాతి చినుకులు ఫేం భరద్వాజ్ రంగావిజ్జుల కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతనే ఇన్‌స్టాగ్రామ్‌ లో వెల్లడించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నిమిషాల వీడియో పోస్టు చేసిన భరద్వాజ్ తన ఆరోగ్య విషయాలు తెలిపాడు. కరోనా సోకినప్పటికీ తనలో తనకు లక్షణాలేవి లేవన్నాడు. తన గురించి, వైరస్‌ గురించి ఎవ్వరూ భయపడవద్దని సూచించాడు. సరైన ఆహారం, మందులతో కరోనా నుంచి బయట పడవచ్చన్నాడు. తనతో కలిసి నటించిన వాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘స్వాతి చినుకులు’, ‘బంధం’ అనే టీవీ సీరియళ్లలో నటిస్తున్న భరద్వాజ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌ కరోనా నుంచి కోలుకోగా.. తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న నవ్య స్వామి, రవికృష్ణ, సాక్షి శివ కూడా వైరస్‌ బారిన పడ్డారు. ఝాన్సీ, ప్రభాకర్‌ వంటి పలువురు నటులకు కూడా వైరస్‌ సోకిందన్న వార్తలు వచ్చాయి.