Exit Polls 2024: ఆశ్చర్యమేమీ లేదు.. కాస్త అటూ ఇటూ గా కమలమే..

543 పార్లమెంటు స్థానాలు ఉన్న మనదేశంలో మెజారిటీ ఫిగర్ 272. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య హోరాహోరీగా పోరు సాగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 9:16 am

Exit Polls 2024

Follow us on

Exit Polls 2024: 18వ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఏడు దశల్లో ఈ ఎన్నికలు సాగాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6:30 నుంచి పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించడం మొదలుపెట్టాయి. 543 పార్లమెంటు స్థానాలు ఉన్న మనదేశంలో మెజారిటీ ఫిగర్ 272. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఈ దఫా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వివిధ సంస్ధలు తమ ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం చేశాయి. ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ను ఒకసారి పరిశీలిస్తే..

ఏబీపీ సీ ఓటర్

ప్రసిద్ధ ఆనంద్ బజార్ పత్రిక, సీ ఓటర్ ఆధ్వర్యంలో వెల్లడించిన ఎగ్జిట్ పోల్ లో ఎన్డీఏ కూటమికి 215-253, ఇండియా కూటమికి 108 స్థానాలు వస్తాయని తేలింది. ఇతరులు 2-10 స్థానాలు దక్కించుకుంటాయని వెళ్లడైంది.

రిపబ్లికన్ మ్యాట్రిజ్

ఈ సంస్థ ఎన్డీఏ కూటమికి ఏకంగా 353 నుంచి 368 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఇండియా కూటమికి 118 నుంచి 133 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. ఇతరులు 43 నుంచి 48 స్థానాలు దక్కించుకుంటారని ప్రకటించింది.

జన్ కీ బాత్

ఎన్డీఏ కూటమి 362 నుంచి 392 స్థానాలు దక్కించుకుంటుందని ప్రకటించింది. ఇండియా కూటమి 141 నుంచి 161 స్థానాలలో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇతరులు 10 నుంచి 20 స్థానాలను దక్కించుకుంటారని ప్రకటించింది.

ఇండియా టుడే యాక్సిస్

ఎన్డీఏ కూటమి 146-162 స్థానాలు గెలుకుంటుందని ప్రకటించింది. ఇండియా కూటమి 71-86 చోట్ల విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇతరులు 2 స్థానాలలో గెలుస్తారని పేర్కొన్నది.

న్యూస్ నేషన్

ఎన్డీఏ కూటమి 342- 378 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇండియా కూటమి 153-169 సీట్లు గెలుస్తుందని ప్రకటించింది. ఇతరులు 21 నుంచి 33 స్థానాల్లో విజయం సాధిస్తారని వివరించింది.

దైనిక్ భాస్కర్

ఎన్డీఏ కూటమి 281 నుంచి 358 స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. ఇండియా కూటమి 145 నుంచి 201 స్థానాలు గెలుచుకుంటుందని వివరించింది. ఇతరులు 33 నుంచి 49 స్థానాల్లో విజయం సాధిస్తారని స్పష్టం చేసింది.