Telangan Loksabha Result 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా తెలంగాణలని హైదరాబాద్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఎంఐఎం అధినేత ఓవైసీ అసదుద్దీన్ పై బీజేపీ తరుపున మాధవీ లత పోటీ చేస్తున్నారు. మాధవీ లత పేరు ప్రకటించినప్పటి నుంచి ఆమె ప్రచారంలో దూసుకెళ్లారు. హిందుత్వ వాదంతో పాటు మోడీ చరిస్మా గురించి ప్రజల్లోకి వెళ్లారు. ఆ తరువాత ఓ చానెల్ ఇంటర్వ్యూ ద్వారా తన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా ఆకట్టుకున్నారు. అయితే ఎంఐఎం కు పట్టు ఉన్న హైదరాబాద్ స్థానంలో బీజేపీ గెలవడం ఆషామాషీ కాదు. ఎందుకంటే ఇక్కడ ముస్లిం ఓట్లే అధికంగా ఉన్నాయి. కానీ తాజాగా వెలువడుతున్న ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్ లో లోక్ సభ ఫలితాలు రౌండ్ రౌండ్ కు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. రెండో రౌండ్ వరకు మాధవీ లత ఆధిక్యంలో కొనసాగగా.. మూడో రౌండ్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ 3 వేల ఓట్లు ముందంజలోకి వెళ్లారు. అయితే ఫలితాలు చివరి వరకు ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఇక్కడ బీజేపీ కచ్చితంగా పాగా వేస్తుందని మాధవీ లత ధీమాతో ఉన్నారు. కానీ ఎంఐం తన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
కానీ దేశ వ్యాప్తంగా వస్తున్న ఫలితాలను చూస్తే ఓవైసీ కోటను మాధవీ లతను కూలుస్తుందా? అన్న చర్చ సాగుతోంది. 2019లో ఓవైసీకి 2,82, 187 ఓట్ల మెజారిటీతో లెలిగాచరు. అయితే ఇప్పుడు ఓవైసీ గెలిచినా ఈ మెజారిటీ రాకపోతే మాత్రం బీజేపీ అభ్యర్థి ప్రభావం ఉన్నట్లేనని అంటున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఆమె ప్రచారంతో యూత్ ను ఆకట్టుకున్నారు. దీంతో ఇక్కడ మార్పు వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడ గెలుపు సునాయసం కాదని అంటున్నారు. గతంలో మొదట్లోనే ఓవైసీ గెలుపు గురించి తెలిసిపోయేది. కానీ ఇప్పుడు చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.