Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చప్పగా సాగుతోంది. మొత్తం 543 స్థానాలకు ఏడు విడతల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈమేరకు షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే మూడు విడతల్లో పోలింగ్ పూర్తయింది. మూడు విడతల్లో జరిగిన పోలింగ్ కనీసం 70 శాతం దాటలేదు. దీంతో మిగతా నాలుగు విడతల్లో పోలింగ్ శాతం పెంచేందుకే ఈసీ రంగంలోకి దిగింది. ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు, స్థానిక అధికారులు, వివిధ ప్రైవేటురంగ సంస్థలతో కలిసి ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెస్టారంట్లు. రైడ్ బస్ ఆపరేటర్లు ఇందులో భాగస్వాములయ్యాయి.
మూడు విడతల్లో పోలింగ్ ఇలా..
2010లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 20.7 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ అంకెను చూస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పట్టణ ఓటర్ల ఉదాసీనత కారణంగా పోలింగ్ శాతం తగ్గుతున్నట్లు ఈసీ గుర్తించింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో 60.14 శాతం. రెండో దశలో 66.71 శాతం. మూడో విడతలో 65.68 శాతం పోలింగ్ జరిగింది. ఇంకా నాలుగు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మే 13, మే 20, మే 25, జూన్ 1న మిగతా విడత ఎన్నికలు జరుగుతాయి. ఈ నాలుగు విడతల్లో పోలింగ్ శాతం పెంచేందకు ఈసీ చర్యలు చేపడుతోంది.
మెట్రోలో డిస్కౌంట్లు..
ముంబయి పౌరులు.. మే 20న ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే సమయంలో మెట్రోలో డిస్కౌంట్ పొందవచ్చు. మెట్రోలైన్ ఎన్నికల రోజున అదనంగా 10 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. పోలింగ్ స్టేషన్‌కు రాకపోకలు చేసే ప్రయాణికులు ముంబయి కార్డ్ సేషర్ క్యూలర్, పేపర్ టికెట్‌పై తగ్గింపు పొందవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో అభిబస్ రాయితీ..
ఇక ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే తెలుగు రాష్ట్రాల వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, కర్టిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. ఇటీవల ఆ సంస్థ సీఈవో లెనిన్ కోడూరు, సీఈఓ రోహిత్‌వర్మ మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 నుంచి 15 తేదీ మధ్య చేసే ప్రయాణాలకు కూపన్ కోడ్ అఆఏఐVౖఖీఉ (అభిఓట్) ఉపయోగించి, టికెట్ ధరలో కనీసం 30 శాతం నుంచి గరిష్టంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చని పేర్కొన్నారు. అదికాక రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందని తెలిపారు. కూపన్ వినియోగించి, టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిలో రోజుకు ఒకరిని డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతిగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ర్యాపిడోలో ఫ్రీ రైడ్..
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లోని ఓటర్లకు ర్యాపిడో ఆఫర్లు ప్రకటించింది. మే 13న పోలింగ్ బూత్‌కు వెళ్లేవారికి ఉచితంగా బైక్ ట్యాక్సీ, ఆటో, క్యాబ్ ప్రయాణాలు ఇస్తామని సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో కలిసి పోలింగ్ శాతం పెంచేందుకు ఈ ఆఫర్ తెచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల రోజున ఓటర్లు ‘వోట్ నౌ’ కోడ్ ఉపయోగించి ర్యాపిడో యాప్ ద్వారా ఉచిత రైడ్‌లను పొందొవచ్చు.
మధ్యప్రదేశ్లో ఉచిత ఆఫర్లు..
ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్, ఇండోర్‌లో మూడు రోజుల పాటు ఫ్రీ రైడ్లు ఇచ్చేందుకు బస్సు ఆపరేటర్లు ముందుకొచ్చారు. బోపాద్, గ్వాలియర్ ఇటీవల పోలింగ్ ముగిసిన విషయం తెలిసించే. దీంతోపాటు పోలింగ్ బూత్‌లో లక్కీ డ్రాలు తీసి టీ–షర్టులను ఇస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నవారు వీటిని పొండవచ్చు.
= ఇటీవల పోలింగ్‌లో పాల్గొన్న భోపాల్‌లో ఓటర్లకు డైమండ్ రింగ్‌లు, రిఫ్రిజరేటర్లు, టెలివిజన్ సెట్లు, వాషింగ్ మిషిన్లు డ్రా తీసి బహూకరించారు.
= పోలింగ్ జరగాల్సిన ఇండోర్‌లో ఎన్నికల రోజు ఓటర్లకు ఉచితంగా పోహ, జిలేబీ అల్పాహారంగా అందించనున్నారు. వేలిపై సిరా గుర్తును చూపిస్తే పలు మెడికల్ ల్యాబ్‌లలో వైద్య పరీక్షలపై డిస్కౌట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
గురుగ్రామ్‌లో సినిమా టికెట్లపై రాయితీ..
గురుగ్రామ్ ఎంపీ సెగ్మెంట్‌లో ఓటింగ్ పెంచేందుకు స్థానిక జిల్లా అధికారులు మల్టీప్లెక్స్‌లతో జట్టు కట్టాయి. ఓటు వేసేవారికి సినిమా టికెట్లు, ఆహార పదార్థాలపై రాయితీ ప్రకటించారు. వీటిని పొందాలంటే వేలిపై సిరా గుర్తు చూపి ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకోవచ్చు.
= హరియాణాలోని 10 లోకసభ నియోజకవర్గాల్లో కూడా వేలిపై సిరా గుర్తును చూపి సినిమా హాల్స్‌లో టికెట్, స్నాక్స్‌పై రాయితీలను పొందే అవకాశం కల్పించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తనవంతుగా ఓ ముందడుగేసింది. తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై వారికి 19 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలనుకునేవారు 18 నుంచి 22 ఏళ్ల వయసువారై ఉండాలి. మొబైల్ యాప్ లేదా కంపెనీ వెబ్‌సైట్ నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించాలి. ఓటు వేయబోయే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు గమ్యస్థానమై ఉండాలి. ఆఫర్ పొందడం కోసం ఐడీ సహా సంబంధిత పత్రాలు చూపించాలి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోని ఎక్స్‌ప్రెస్ లైట్, ఎక్స్‌ప్రెస్ వాల్యూ, ఎక్స్‌ప్రెస్ ఫ్లెక్స్, ఎక్స్‌ప్రెస్ బిజ్ ఇలా నాలుగు కేటగిరీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.