SSC : మన దేశంలో పదో తరగతి అనేది ప్రాథమిక విద్యార్హతగా మారింది. ఒకప్పుడు పదో తరగతి చదివినవారికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ, నేడు ఇంజినీరింగ్, పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా ప్రభుత్వ కొలువు కష్టంగా మారింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా ఐటీ కొలువులు కూడా తగ్గిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో పదో తరగతి పూర్తి చేసి కూడా ఉద్యోగం సాధించే కొలువులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, ఎంబీబీఎస్ చేయలేని స్థితిలో చాలా మంది ఉంటారు. ఇంటివారికి వైద్యరగంలో ప్రవేశించే మార్గాలు ఉన్నాయి. పదో తరగతి పాస్ అయితే చాలు. ఈ కోర్సులను పూర్తి చేసి చక్కని ఉపాధితోపాటు అధిక వేతనం కూడా అందుకోవచ్చు. ఆ కోర్సులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. డీఎంఎల్డీ (డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ)
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు రెండేళ్లు ఉంటుంది. ఇందులో ల్యాబ్ టెస్టులు, రోగ నిర్ధారణ, రిపోర్టు, ప్రిపరేషన్ మొదలైనవి నేర్పిస్తారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన ఈ కోర్సు చేసినవారికి డిమాండ్ ఉంది. అధిక జీతం కూడా ఇస్తారు.
2. రేడియాలజీ టెక్నాలజీ కోర్సు
ఈ కోర్సులో చేరేవారికి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ యంత్రాల ఆపరేట్ చేయడం నేర్పుతారు. పదో తరగతి తర్వాత రెండేళ్ల డిప్లొమా కోర్సు చేయవచ్చు. కోర్సు పూర్తయ్యాక రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం పొందవచ్చు.
3. డిప్లొమా ఇన్ ఫార్మసీ..
ఈ రెండేళ్ల కోర్సులో ఔషధాలు, వాటి విక్రయాల గురించిన సమాచారం బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మెడికల్ స్టోర్ ప్రారంభించవచ్చు. లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేయవచ్చు.
4. ఆప్టోమెట్రీలో డిప్లొమా
ఈ కోరు కంటికి సంబంధించినది. దృష్టిని మెరుగుపర్చడానికి అవసరమైన విక్షణ ఇస్తారు. ప్రారంభ వేతనం రూ.25 వేల నుంచి రూ.40 వేలు ఉంటుంది.
5. ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం
ఈ కోర్సు వ్యవధి కూడా రెండేళ్లే. ఈ కోర్సులో ప్రాథమిక నర్సింగ్ నైపుణ్యాలను బోధిస్తారు. నర్సింగ్ ఫీల్డ్‌ను కెరీర్ ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
6. డెంటల్ హైజీనిస్ట్ కోర్సు
ఈ కోర్సులో దంతాల శుభ్రత, వ్యాధులను గుర్తించడం మొదలైనవి నేర్పుతారు. ఇది కూడా రెండేళ్ల కోర్సు. ప్రారంభ వేతనం రూ.25 వేల నుంచి మొదలవుతుంది.
7. డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ
ఈ కోర్సు కూడా రెండేళ్లే. శారీరక రుగ్మతలను నంయ చేసే పద్ధతులు నేర్పుతారు. ఈ కోర్సు పూర్తి చేశాక క్లినిక్ తెరవడం లేదా ఆస్పత్రిలో పని చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చు.
8. హెూమియోపతి అసిస్టెంట్ కోర్సు
హోమియో మందులు, చికిత్సకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. రెండేళ్ల కోర్సు. ఇది పూర్తి చేసిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది.
9. సర్జికల్ అసిస్టెంట్ కోర్సు
ఆపరేషన్ సమయంలో వైద్యులకు సహాయం చేయడానికి ఈ కోర్సు ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ కోర్సు రెండు సంవత్సరాలు. ఈ కోర్సుకు అత్యధిక డిమాండ్ ఉంది.
10. అంబులెన్స్ అసిస్టెంట్ కోర్సు
అత్యవసర సమయాల్లో అంబులెన్స్ నడపడానికి, ప్రథమ చికిత్స అందించడంపై ఇందులో శిక్షణ ఇస్తారు. పూర్తిచేసిన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుంది.