Employees Salaries: ప్రపంచంలో చాలా మంది ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు. కొందరు చిన్న సంస్థలలో పనిచేస్తే మరికొందరు కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తారు. కొందరికి రూ. వేలల్లో వేతనాలు ఉంటే మరికొందరికి రూ. లక్షల్లో జీతాలు ఇస్తుంటారు. వారి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో వేతనాలు ఇవ్వడంలో పలు సంస్థలు పలు మార్గాలు పాటిస్తుంటాయి. ఉద్యోగుల వేతనాల సంఖ్యను మాత్రం బయటకు చెప్పకుండా దాస్తుంటాయి.
ప్రపంచంలో ఒకే రకమైన ఉద్యోగం చేసే వారికి ఒకే రకమైన వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కంపెనీల యాజమాన్యాలు ఇలా చేయడం లేదు. ఫలితంగా జీతాలు ఇవ్వడంలో తారతమ్యం కనిపిస్తోంది. యాజమాన్యాలు తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు. దీంతో ఎప్పుడైనా ఏ కారణం లేకుండా కూడా ఉద్యోగులను తొలగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
Also Read: Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.. ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఏదంటే?
జీతాల విషయంలో పారదర్శకంగా ఉంే సంస్థల ఉత్తమ అభ్యర్థులను ఆకర్షించేందుకు ఉద్యోగులను పొందేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్ కూడా మారుతోంది. కంపెనీల మార్గదర్శకాలు కూడా మారుస్తూ ఉద్యోగుల భవితవ్యంపై ప్రభావం చూపెడుతుననాయి. సంస్థలు నష్టాల్లో కూరుకుపోతే ఉద్యోగులపై కూడా భారం మోపే విధంగా నిబంధనలు మారుస్తున్నాయి.
Also Read: Online fraud: ఆన్ లైన్ మోసం.. కోటి మాయం