భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మహిళలకు కూడా ఇండియన్ నేవల్ అకాడమీతో పాటు నేషనల్ డిఫెన్స్ లో ప్రవేశాలను కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 9వ తేదీన యూపీఎస్సీ రిలీజ్ చేసిన మార్గదర్శకాలు మహిళా అభ్యర్థులకు కూడా వర్తించనున్నాయి.

ఈ ఏడాది నవంబర్ నెల 14వ తేదీన ఎన్డీఏ పరీక్షతో పాటు నావల్ అకాడమీ పరీక్షలు జరగనున్నాయి. పుణె, ఖడక్ వాస్లా అకాడమీలలో మొత్తం 370 సీట్లు ఉన్నాయని కేరళ రాష్ట్రంలోని అకాడమీలలో 30 సీట్ల భర్తీ జరగనుందని సమాచారం. upsconline.nic.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మే నుంచి మహిళలను ఎన్డీఏలోకి తీసుకుంటామని మొదట వెల్లడించింది.
అయితే సుప్రీం కోర్టు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. పెళ్లి కాని మహిళా అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా అక్టోబర్ నెల 8వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ మహిళలకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎంత వేతనం లభించనుందో తెలియాల్సి ఉంది.
అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.