
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రంగ కంపెనీలలో ఒకటైన ఈ సంస్థ 51 మైనింగ్ మేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
http://www.ucil.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు డీజీఎంఎస్ జారీ చేసిన మెటాలిఫెరస్ మైన్స్ మైనింగ్ మేట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో ఏడాది పని అనుభవం ఉండటంతో పాటు హిందీ చదవడం, రాయడంలో ప్రొఫిషియెన్సీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఉద్యోగాల గురించి ఆసక్తి ఉన్న అభ్యర్థులు యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ జార్ఖండ్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
జూన్ 10వ తేదీ దరఖాస్తులకు చివరితేదీగా ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.