https://oktelugu.com/

Jobs: మల్కాజ్‌గిరి భరోసా సెంటర్‌ లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.30 వేల వేతనంతో?

Jobs: హైదరాబాద్‌ మల్కాజ్‌గిరికి చెందిన భరోసా సెంటర్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 4 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఏఎన్‌ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, రిసెప్పనిస్ట్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు లీగల్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌ఎం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 19, 2022 / 04:43 PM IST
    Follow us on

    Jobs: హైదరాబాద్‌ మల్కాజ్‌గిరికి చెందిన భరోసా సెంటర్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 4 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఏఎన్‌ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, రిసెప్పనిస్ట్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు లీగల్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌ఎం పాసై 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండటంతో పాటు కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వ్యక్తులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. బీఎస్సీ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఏఎన్‌ఎం ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు రెండేళ్ల అనుభవంతో పాటు 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

    ఏదైనా డిగ్రీ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవాళ్లు రిసెప్షనిస్ట్ పోస్టులకు అర్హులు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైబరాబాద్ కమిషనరేట్, గచ్చిబౌలిలో దరఖాస్తులను అందించాల్సి ఉంటుంది.

    మార్చి 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ కాగా https://womensafetywing.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.