https://oktelugu.com/

Indian Coast Guard 2021:  నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో కోస్ట్ గార్డ్ లో ఉద్యోగ ఖాళీలు?

Indian Coast Guard 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్, లాస్కర్, ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. joinindiancoastguard.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2021 / 06:20 PM IST
    Follow us on

    Indian Coast Guard 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్, లాస్కర్, ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. joinindiancoastguard.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Indian Coast Guard 2021

    మొత్తం 96 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వార భర్తీ చేయనుండగా 2022 సంవత్సరం జనవరి 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. పది అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ట్రేడ్‌ సర్టిఫికెట్‌, అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 5,200 రూపాయల నుంచి 20,200 రూపాయల వేతనం లభిస్తుంది.

    Also Read: ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో 300 జాబ్స్.. రూ.25 వేల వేతనంతో?

    నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ఇంజిన్ డ్రైవర్ 5 పోస్టులు, సారంగ్ లాస్కర్ 2 పోస్టులు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 5 పోస్టులు, ఫైర్‌మెన్ 53 ఉద్యోగ ఖాళీలు, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ 11 ఉద్యోగ ఖాళీలు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్ 5 ఉద్యోగ ఖాళీలు, స్టోర్ కీపర్ గ్రేడ్2 3 ఉద్యోగ ఖాళీలు, స్ప్రే పెయింటర్ ఒక ఉద్యోగ ఖాళీ ఉన్నాయి.

    మోటార్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్ ఒక పోస్ట్, లాస్కర్ 5 ఉద్యోగ ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్) 3 పోస్టులు, అన్‌స్కిల్డ్ లేబర్ 2 పొస్టులు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

    Also Read: ఐఓసీఎల్ లో 300 ఉద్యోగ ఖాళీలు.. ఈ అర్హతలతో జాబ్ పొందే ఛాన్స్?