Telangana 10th results 2026: తెలంగాణ పదో తరగతి (SSC) పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం దగ్గరపడింది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో ఫలితాలు ప్రకటించే అవకాశముందని అధికారుల సూచనలతో అర్థమవుతోంది. అయితే అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పదోతరగతి ఫలితాలను ఈ క్రింది వెబ్ సైట్ల ద్వారా చూసుకోవచ్చు.
2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా చేపట్టి ఏప్రిల్ 23 నాటికే పూర్తి చేశారు. దీంతో ఫలితాల విడుదలకు అవసరమైన సాంకేతిక ప్రక్రియలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి.
అనుకున్న సమయానికి ఫలితాలు రిలీజ్ అయితే విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ Board of Secondary Education Telangana ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం https://bse.telangana.gov.in/ ను సందర్శించి, SSC Results లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే మార్కులు, గ్రేడ్‌లు తెలుసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే సర్వర్‌పై భారీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు ఓపికగా ప్రయత్నించడం మంచిది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, విద్యార్థుల సౌకర్యార్థం మరికొన్ని వెబ్‌సైట్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంచుతారు. ముఖ్యంగా
results.cgg.gov.in
examresults.ts.nic.in
manabadi.co.in
schools9.com
వంటి వెబ్‌సైట్ల ద్వారా కూడా SSC ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. ఈ సైట్లలో కూడా హాల్ టికెట్ నంబర్ నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.
ఫలితాలు ప్రకటించిన తరువాత విద్యార్థులు తాత్కాలిక మార్క్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అసలు మార్క్ మెమోలు తరువాత సంబంధిత పాఠశాలల ద్వారా అందిస్తారు. ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే, రీకౌంటింగ్ లేదా రీవాల్యూయేషన్ కోసం అప్లై చేసే అవకాశాన్ని కూడా పరీక్షల విభాగం కల్పిస్తుంది.
తెలంగాణ SSC ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకుని, తప్పులు ఉంటే రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉత్తీర్ణులైతే ఇంటర్‌డియట్ లేదా పాలిటెక్నిక్ (TS POLYCET)అడ్మిషన్ల కోసం సిద్ధపడాలి. ఫలితాలు చూసిన వెంటనే అధికారిక సైట్ bse.telangana.gov.inలో రీకౌంటింగ్ (₹100/సబ్జెక్ట్) లేదా రీవెరిఫికేషన్ (₹600/సబ్జెక్ట్) దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కులు మారితే కొత్త మెమ ఇష్యూ అవుతుంది. తగ్గితే ఒరిజినల్ సరెండర్ చేయాలి. ఫెయిల్ అయిన సబ్జెక్టులకు సప్లిమెంటరీ పరీక్షలు ఉండే అవకాశం ఉంది. పాస్ అయితే స్కూల్ నుంచి ఒరిజినల్ మీమో తీసుకోండి.
