https://oktelugu.com/

Jobs: నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నాగ్ పూర్ క్యాంపస్ లో ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎండోక్రైనాలజీ, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలతో పాటు అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్‌ మెడిసిన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 27, 2021 / 12:43 PM IST
    Follow us on

    Jobs: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నాగ్ పూర్ క్యాంపస్ లో ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    ఎండోక్రైనాలజీ, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలతో పాటు అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్‌ మెడిసిన్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎండీ/ఎంఎస్‌/డీఎం /ఎంసీహెచ్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో తప్పనిసరిగా అనుభవం ఉండాలి. 50 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ది డైరెక్టర్, ఎయిమ్స్‌ నాగ్‌పూర్, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్, ప్లాట్‌ నెం.2, సెక్టార్‌–20, మిహాన్, నాగ్‌పూర్‌–441108 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 1,01,500 రూపాయల నుంచి 2,20,400 రూపాయల వరకు వేతనం లభించనుంది.

    2022 సంవత్సరం జనవరి 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. https://aiimsnagpur.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.