https://oktelugu.com/

Hyderabad Jobs:  ఆర్మీ స్కూల్ లో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Hyderabad Jobs: సికింద్రాబాద్‌ బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. టీచింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీఈటీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ విభాగాలతో పాటు ఇంగ్లిష్‌, హిందీ, సోషల్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌, యోగా, జియోగ్రఫీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కెమిస్ట్రీ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2021 / 10:00 AM IST
    Follow us on

    Hyderabad Jobs: సికింద్రాబాద్‌ బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. టీచింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, పీఈటీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ విభాగాలతో పాటు ఇంగ్లిష్‌, హిందీ, సోషల్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌, యోగా, జియోగ్రఫీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కెమిస్ట్రీ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

    ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పాస్ కావడంతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్‌ స్కోర్‌ కార్డ్‌ ఉంటే మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ది ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ బొల్లారం, సికింద్రాబాద్‌ 500087 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

    సీబీఎస్‌ఈ/ఏడబ్ల్యూఈఎస్‌ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. 2021 సంవత్సరం జనవరి 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.apsbolarum.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. https://www.apsbolarum.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.