https://oktelugu.com/

Jobs: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో జాబ్స్.. నెలకు రూ.లక్ష వేతనంతో?

Jobs: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 16 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. వెబ్‌ అడ్మినిస్ట్రేటర్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, హిందీ ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీటెక్‌/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ/ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 5, 2022 / 03:37 PM IST
    Follow us on

    Jobs: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 16 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. వెబ్‌ అడ్మినిస్ట్రేటర్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, హిందీ ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    బీటెక్‌/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ లేదా ఇంటర్మీడియట్‌/ బీఎస్సీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. establishment@svpnpa.gov.in ఈమెయిల్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుందని సమాచారం.

    అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఎస్‌వీపీ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్‌ 500052 అడ్రస్ కు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 45,186 రూపాయల నుంచి 1,16,398 రూపాయలు వేతనంగా లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

    అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.