Success story: పట్టుదల, పంతం, స్పష్టమైన లక్ష్యం ఉంటే సాధించలేదనిది ఏది లేదు. దీనిని మరోసారి నిరూపించారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం అక్కాచెల్లెళ్లు. ఎస్సై కొలువు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పంతం పట్టారు. పట్టుదలతో సాధన చేశారు. ఇంకేముంద గోల్‌ను రీచ్ అయ్యారు. ఇటీవల ఏపీ ప్రకటించిన ఎస్సై ఫలితాల్లో ఇద్దరూ ఎస్సైలుగా సెలక్ట్ అయ్యారు. దీంతో మల్కీపురం పొంగిపోతోంది.
సాధారణ కుటుంబంలో పుట్టి..
సాధారణ కుటుంబంలో పుట్టిన కరుణ, రేవతి అక్కాచెల్లెళ్లు. ఇద్దరిదీ ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. అడ్డంగులను అధిగమిస్తూ, పరస్పరం సాయం చేసుకుంటూ ముందుకు సాగారు. దీంతో డబుల్ విక్టరీ వారి సొంతమైంది. అందరికీ ఆ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. అందరూ గొప్పగా చెప్పుకునేలా చేసింది.
తల్లిదండ్రుల సాయం..
సాధారణంగా ఆడపిల్లలను పోలీస్ కొలువుకు ప్రోత్సహించేవారు తక్కువగా ఉంటారు. కానీ, ఎస్సై కావలనుకున్న కరుణ, రేవతి లక్ష్యాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఇందుకోసం డీసీపీ మోకా సత్తిబాబు–రమాదేవి ట్రస్టు ద్వారా ఉచితంగా శిక్షణ తీసుకున్నారు. పట్టుదలతో సాధన చేశారు. లక్ష్యాన్ని సాధించారు. తమ ట్రస్టులో ఉచిత శిక్షణ తీసుకున్న పేద అక్కాచెల్లెళ్లు కరుణ రేవతి ఎస్సైగా ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని ట్రస్టు నిర్వాహకుడు సత్తిబాబు అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే.. లక్ష్యం ఉన్నవారిని ప్రోత్సహిస్తే ఫలితం ఎలా ఉంటుందో కరుణ, రేవతి నిదర్శనమన్నారు.
తండ్రి చికెన్ సెంటర్..
కరుణ, రేవతిల తండ్రి సకినేటిపల్లిలో ఓ చికెన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థికంగా తమ పరిస్థితి ఏమితో ఆ అక్కా చెల్లెళ్లు బాగా అర్థం చేసుకున్నారు. అయినా లక్ష్యం మార్చుకోలేదు. పట్టుదల వీడలేదు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగారు. లక్ష్యాన్ని చేరుకుని ఇద్దరూ ఒకేసారి ఎస్సైలుగా ఎంపికయ్యారు. దీంతో ఊరంగా పండుగ జరుపుకుంటోంది. ఆదర్శంగా నిలిచిన కరుణ, రేవతిని అందరూ అభినందిస్తున్నారు.