SSC Recruitment 2025: ఉద్యోగా నోటిఫకేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేంద్రం వరుస నోటిఫికేషన్లు ఇస్తూ అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే పోస్టల్, రైల్వే, బ్యాంకింగ్ రంగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. తాజాగా కేంద్ర శాఖల్లోని ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 20,128 ఖాళీలను భర్తీ చేయడానికి కీలక నోటిఫికేషన్లను విడుదల చేసింది. సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్, ఎంటీఎస్, హవాల్దార్, జూనియర్ ఇంజినీర్ వంటి విభాగాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు గల అభ్యర్థులకు విస్తృత అవకాశాలను అందిస్తున్నాయి. యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరత్వం సాధించేందుకు ఇది మంచి అవకాశం.
Also Read: బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు ఇవీ.. ఎలా అప్లై చేయాలంటే?
సీజీఎల్ పోస్టులే ఎక్కువ..
తాజా నోటిఫికేషన్‌లో 14,582 పోస్టులు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్)కు సంబంధించినవే. ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, జులై 4 ఆఖరి తేదీగా నిర్ణయించబడింది. ఆగస్టు 13 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్–1 పరీక్ష నిర్వహించబడుతుంది. డిసెంబర్‌లో టైర్–2 పరీక్ష జరుగనుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్‌వో) పోస్టులకు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌తో డిగ్రీ అవసరం. ఇతర గ్రూప్–ఇ పోస్టులకు సాధారణ డిగ్రీ సరిపోతుంది. వయోపరిమితి సాధారణంగా 30 ఏళ్లు ఉండాలి. జేఎస్‌వోకు 32 ఏళ్లు, గ్రూప్–ఇ పోస్టులకు 27 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
మిగిలిన పోస్టులకు వీరు మర్హులు..
సీజీఎల్ పోస్టులు తర్వాత సీహెచ్‌ఎస్‌ఎల్, ఎంటీఎస్, హవల్దార్, జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. సీజీఎల్‌తోపాటు కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ (సీహెచ్‌ఎస్‌ఎల్), మల్టీ–టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), హవాల్దార్, జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్లు మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తాయి. సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టులకు ఇంటర్ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులను, ఎంటీఎస్, హవాల్దార్ పోస్టులకు 10వ తరగతి అర్హతతో గ్రూప్–ఈ పోస్టులను, జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమాతో టెక్నికల్ పోస్టులను అందిస్తాయి.
Also Read: AI లాంటి జేజమ్మ టెక్నాలజీ వచ్చినా.. ఆందోళన వద్దు. ఉద్యోగాలు మరిన్ని పెరుగుతాయి..
పరీక్షా విధానం..
ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షలు బహుళ దశల్లో జరుగుతాయి. సీజీఎల్‌లో టైర్–1 (సీబీటీ), టైర్–2 (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. సీహెచ్‌ఎస్‌ఎల్‌లో టైర్–1, టైర్–2, స్కిల్ టెస్ట్, ఎంటీఎస్ /హవాల్దార్‌లో సీబీటీ, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, జేఈలో టైర్–1, టైర్–2, ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ పరీక్షలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ వంటి విభాగాలను కవర్ చేస్తాయి. అభ్యర్థులు సమగ్ర సన్నాహకంతో, ముఖ్యంగా ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు, మునుపటి ప్రశ్నపత్రాల అధ్యయనం ద్వారా విజయం సాధించవచ్చు.
ఎస్‌ఎస్‌సీ విడుదల చేసిన 20,128 పోస్టుల నోటిఫికేషన్ భారత యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరత్వం, ఆర్థిక భద్రత సాధించే అద్భుత అవకాశం. పారదర్శకంగా ఎంపిక విధానం ఉంటుంది. తీవ్ర పోటీ కారణంగా అభ్యర్థులు సమగ్ర సన్నాహకం, సమయ నిర్వహణపై దృష్టి పెట్టాలి.