https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..?

సికింద్రాబాద్ లో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 80 మెడికల్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా మే 29వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగాల […]

Written By: Kusuma Aggunna, Updated On : May 29, 2021 9:59 am
Follow us on

సికింద్రాబాద్ లో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 80 మెడికల్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా మే 29వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 80 ఉద్యోగ ఖాళీలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఉద్యోగ ఖాళీలు 3, జీడీఎంవో ఉద్యోగ ఖాళీలు 16, స్టాఫ్‌నర్సు ఉద్యోగ ఖాళీలు 31, హాస్పిటల్‌ అటెండెంట్‌ ఉద్యోగ ఖాళీలు 26, ఫార్మాసిస్ట్‌ ఉద్యోగ ఖాళీలు 2, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ ఖాళీలు 1, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.

సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్‌ డిగ్రీ, పీజీ/డిప్లొమా పాసైన వాళ్లు స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ డిగ్రీ పాసై ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన వాళ్లు జీడీఎంవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీ(నర్సింగ్‌)/నర్స్‌ మిడ్‌వైఫరీలో సర్టిఫికేట్‌ కలిగి ఉన్నవాళ్లు నర్సింగ్ సూపరిండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు హాస్పిటల్‌ అటెండర్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, బీఫార్మసీ పాసైన వాళ్లు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 4, 5 తేదీలలో ఆన్ లైన్ ఇంటర్య్వ్యూ ద్వారా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉండగా మే 29వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.