https://oktelugu.com/

Jobs: సింగరేణిలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: సింగ‌రేణి కేల‌రీస్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 45 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 45 స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 45 సంవత్సరాల లోపు వయస్సు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 12, 2022 3:56 pm
    Follow us on

    Jobs: సింగ‌రేణి కేల‌రీస్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 45 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 45 స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో జనరల్ సర్జన్, ఆర్థో స‌ర్జ‌న్, ఈఎన్‌టీ స‌ర్జ‌న్‌, ఆప్త‌మాల‌జిస్ట్‌, గైన‌కాల‌జిస్ట్‌, చెస్ట్ ఫిజిషియ‌న్‌, సైకియాట్రిస్ట్‌, పీడియాట్రీషియ‌న్‌, అనెస్థిటిస్ట్‌, హెల్త్ ఆఫీస‌ర్, పాథాలజిస్ట్, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    పీజీ డిగ్రీ, డీ.ఎన్.బీతో పాటు స్పెషలైజేషన్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. https://scclmines.com/012022/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 17వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.