https://oktelugu.com/

RITES Recruitment 2021: రైట్స్‌ లిమిటెడ్‌లో 48 ఉద్యోగ ఖాళీలు.. రూ.లక్షన్నర వేతనంతో?

RITES Recruitment 2021: Nజాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 48 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ 48 ఉద్యోగ ఖాళీలలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 25 ఉండగా మెకానికల్‌ ఉద్యోగ ఖాళీలు 15, ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి. బీఈ, బీఎస్సీ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 23, 2021 / 11:39 AM IST
    Follow us on

    RITES Recruitment 2021: Nజాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 48 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    ఈ 48 ఉద్యోగ ఖాళీలలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 25 ఉండగా మెకానికల్‌ ఉద్యోగ ఖాళీలు 15, ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి. బీఈ, బీఎస్సీ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

    ఆగష్టు 25 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. https://www.rites.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.