ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. మోడల్ స్కూళ్లలో 282 ఉద్యోగ ఖాళీలు?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గిన సంగతి తెలిసిందే. కేసులు రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సైతం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ […]

Written By: Navya, Updated On : December 11, 2021 8:12 am
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గిన సంగతి తెలిసిందే. కేసులు రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సైతం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.

కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఆమోదం తెలిపింది. మొత్తం 282 ఉద్యోగ ఖాళీలలో 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగ ఖాళీలు ఉండగా 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. త్వరలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే మోడల్ స్కూళ్లలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న వాళ్లకు ఇందులో ప్రాధాన్యత ఉండనుంది.

2009 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పథకం వల్ల మోడల్ స్కూళ్ల ఏర్పాటు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో మొత్తం 165 స్కూళ్లు ఈ విధంగా ఏర్పాటు అయ్యాయి. ఈ స్కూళ్లలో వందల సంఖ్యలో విద్యార్థులు చదువుతుండటం గమనార్హం. ఉద్యోగ ఖాళీలను జోన్ ల వారీగా పరిశీలిస్తే జోన్1 లో 50 పోస్టులు, జోన్2 లో 4 పోస్టులు, జోన్‌ 3లో 73 పోస్టులు, జోన్‌ 4లో 155 పోస్టుల భర్తీ జరగుతోంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.