NEET: వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇత వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–యూజీ 2024లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో 1,500 మందికిపైగా అభ్యర్థులకు వచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని తెలిపింది. ఈమేరకు సుప్రీం కోర్టుకు గురువారం(జూన్ 13న) విన్నవించింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది.
1,563 మందికి గ్రేస్ మార్కులు..
ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో 1,563 మందికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చింది. ఎన్‌సీఈఆర్టీ పార్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్షలో అక్రమాలు కూడా జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటిపై అధ్యయనానికి కేంద్రం విద్యాశాఖ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది.
కమిటీ నిర్ణయం మేరకే..
కమిటీ నిర్ణయం మేరకు కేంద్రం గురువారం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది. కోల్పోయిన సమాయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తామని తెలిపింది. వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది.
జూన్ 23న పరీక్ష..
ఇదిలా ఉండగా ఈ 1,563 మందికి జూన్ 23న పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. ఈనెల 30న ఫలితాలు ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది. పరీక్ష, ఫలితాల తర్వేతో అందరికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. ఒకవేళ విద్యార్థులు పరీక్ష మళ్లీ రాయడానికి ఇష్టపడకుంటే గ్రేస్ మార్కులు కాకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది.
స్టేకు సుప్రీ నిరాకరణ..
ఇదిలా ఉండగా నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీ కోర్టు గురువారం మరోమారు విచారణ జరిపింది. అయితే వెబ్ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఎన్‌టీఏకు నోటీసుల జారీ చేసింది. ఇదిలా ఉండగా, జూలై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Removal of grace marks re examination for those 1500 people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com