jobs: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 137 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆపరేటర్(కెమికల్ ట్రెయినీ) ఉద్యోగ ఖాళీలతో పాటు జూనియర్ ఫైర్‌మెన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
ఆన్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 18,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. https://www.rcfltd.com/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2022 సంవత్సరం మార్చి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. ఏకంగా 137 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.