jobs: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 137 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆపరేటర్(కెమికల్ ట్రెయినీ) ఉద్యోగ ఖాళీలతో పాటు జూనియర్ ఫైర్‌మెన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
2022 సంవత్సరం మార్చి 1వ తేదీ నాటికి 29 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 6 నెలల ఫుల్‌టైం ఫైర్‌మెన్ సర్టిఫికేట్ కోర్సు చేసిన వాళ్లు జూనియర్ ఫైర్‌మెన్ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం మార్చి 1వ తేదీనాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 18,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. https://www.rcfltd.com/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2022 సంవత్సరం మార్చి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. ఏకంగా 137 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Rcfl recruitment 2022 rashtriya chemicals and fertilizers limited invites applications for various posts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com