Ram Charan : ప్రస్తుతం టాలీవుడ్ లో ఫేక్ పోస్టర్స్ జోరు ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాల దగ్గర నుండి, పెద్ద హీరోల సినిమాల వరకు ప్రతీ ఒక్కరు వచ్చిన వసూళ్లకంటే 30 శాతానికి పైగా ఎక్కువ చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం పోస్టర్లు ఇండస్ట్రీ లో పెద్ద దుమారమే రేపింది. 300 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిన సమయంలో మేకర్స్ 400 కోట్ల రూపాయిల గ్రాస్ పోస్టర్ ని విడుదల చేసారు. 400 కోట్ల రూపాయిలు వచ్చినప్పుడు, ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ పోస్టర్ ని దింపారు. దీనిపై ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసిన నాగ వంశీ మాట్లాడుతూ వచ్చిన వసూళ్లు చెప్పాము, నమ్మితే నమ్మండి, లేకపోతే నమ్మకండి, మాకు ఎలాంటి సమస్య లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా ఇంకా 382 కోట్ల వద్దే ఆగిందని అంటున్నారు.
ఇది కాసేపు పక్కన పెడితే రీసెంట్ గా విడుదలైన గోపీచంద్ విశ్వం చిత్రానికి కూడా ఫేక్ పోస్టర్స్ ని దించారు. మొదటి రోజే ఈ సినిమాని కొన్ని బయ్యర్స్ అందరికీ లాభాలు వచేశాయని ఒక పోస్టర్ దింపారు. ఇది పెద్ద వివాదాస్పదం గా మారింది. అలాగే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి. ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా 234 కోట్ల రూపాయిల గ్రాస్ వచిన్నట్టు ఒక పోస్టర్ ని దింపారు. దీని మీద సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. స్టార్ హీరోల అభిమానులు వీటిపై ట్రోల్స్ వేసుకోవడం, మీ హీరో ఫేక్ అనడం, మా హీరో గ్రేట్ అనడం సర్వ సాధారణం. ఇప్పటికీ అలాంటి ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ అభిమానులు, గతం లో తమ హీరో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ పోస్టర్స్ మధ్య పెద్ద రగడ జరిగింది. కొన్ని ప్రాంతాలలో బయట కొట్టుకున్నారు కూడా.
ఇవన్నీ రామ్ చరణ్ దృష్టికి వెళ్లడం తో ఇక నుండి తన సినిమాలకు కలెక్షన్స్ పోస్టర్ వేయరాదని తన నిర్మాతలకు రిక్వెస్ట్ చేసాడు. కేవలం మాటవరసకు చెప్పడమే కాదు, ‘రంగస్థలం’ తర్వాత విడుదలైన ‘వినయ విధేయ రామ’ చిత్రానికి కలెక్షన్స్ పోస్టర్ వేయలేదు. జనవరి 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వబోతున్న ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా కలెక్షన్స్ పోస్టర్స్ వేయొద్దు అని రామ్ చరణ్ దిల్ రాజు ని రిక్వెస్ట్ చేసాడట. కానీ ఆడియన్స్ ని ఆకర్షితులను చేసి థియేటర్స్ కి రప్పించేది ఇలాంటి పోస్టర్స్ మాత్రమే అని నిర్మాతలు నమ్ముతున్నారు. మరి దిల్ రాజు రామ్ చరణ్ రిక్వెస్ట్ ని అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి.