Jobs: వెస్ట్ సెంట్రల్ రైల్వే వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జబల్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ ఉండగా జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. మొత్తం 20 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలతో పాటు జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
2022 సంవత్సరం మార్చి 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://wcr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
ఎక్కువ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.