
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 35 డిప్లొమా ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 15వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జూన్ 15వ తేదీ ఈ ఉద్యోగాలకు చివరి తేదీగా ఉంది. https://www.powergrid.in/ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 35 ఖాళీలలో డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 30, డిప్లొమా ట్రెయినీ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 5 ఉంటాయి.
కనీసం 75 శాతం మార్కులతో డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021, జూన్ 15 నాటికి 27 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 25,000 రూపాయల నుంచి 1,17,500 రూపాయలుగా ఉంది. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు 300 రూపాయలు కాగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.powergrid.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.