Oil India Limited Recruitment 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు చెప్పింది. 535 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతున్న పనుల కొరకు ఉద్యోగులను నియమించుకోనుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
https://www.oil-india.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ఫిట్టర్- 144 ఉద్యోగ ఖాళీలు, మెకానిక్ మోటార్ వెహికిల్- 42 ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రీషియన్ – 38 ఉద్యోగ ఖాళీలు, మెకానిక్ డీజిల్ ట్రేడ్- 97 ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్- 40 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 81 ఉద్యోగ ఖాళీలు, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 8 ఉద్యోగ ఖాళీలు, టర్నర్- 4 ఉద్యోగ ఖాళీలు, బాయిలర్ అటెండెంట్- 8 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఐటీ ట్రేడ్- 5 ఉద్యోగ ఖాళీలు, వెల్డర్- 6 ఉద్యోగ ఖాళీలు, సర్వేయర్- 5 ఉద్యోగ ఖాళీలు, ఎంపీసీ- 44 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగిలిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. 26,600 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనంగా లభిస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.