Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 150 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. గేట్ స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్ట్ చేస్తారని ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం అందుతోంది.
ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండగా మిగిలిన వాళ్లకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం మే నెల 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని సమాచారం అందుతోంది.
https://www.mha.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2020, 2021, 2022 సంవత్సరాలకు సంబంధించి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ఈసీఈ బ్రాంచ్ కు సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 56 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.