NIT Placements 2024: తెలంగాలోని వరంగల్ లో ఉన్న జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్‌ఐటీ) భారీ ప్యాకేజీ కొలువులకు అడ్డాగా మారింది. నిట్‌లో సీటు వచ్చిందంటే.. ఉద్యోగంతోనే బయటకు వెళ్తామన్న భరోసా విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఇక్కడి విద్యార్థులు అన్నిరంగాల్లో నైపుణ్యం ఉంటుందని, అన్నిరంగాల్లో రాణిస్తారన్న భావనతో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఎన్‌ఐటీలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేందుకు రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.
తాజా సెలక్షన్స్‌లో నిట్ విద్యార్థుల జోరు..
నిట్‌లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదువుతున్న విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో కూడా ఏటా తమ జోరు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది బీటక్లో 82 శాతం, ఎంటెక్‌లో 62.3 శాతం, ఎసీఏలో 82.6 శాతం, ఎమ్మెస్సీలో 80 శాతం, ఎంబీఏలో 76 శాతం విదాఉ్యర్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. మొత్తంగా 1,483 మంది ఉత్తీర్ణత సాధించగా, 1,128 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
ఏటా పెరుగుతున్న కొలువులు..
వరంగల్ నిట్‌లో చదివి ఉద్యోగాలు సాధిస్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21 నుంచి క్యాంపస్ సెలక్షన్స్ క్రమంగా పెరుగుతున్నాయి 2020–21లో క్యాంస్ సెలక్షన్స్ కోసం 186 కంపెనీలు పాల్గొన్నాయి. 815 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అత్యధికంగా రూ.52 లక్షల ప్యాకేజీ తీసుకున్నారు. ఇక 2021–22లో 1,108, 2022–23లో 1,404 మంది విద్యార్థులు క్యాంస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ సాధించారు. 2023లో 1,410 మంది, తాజాగా 2024లో 1,128 మంది కొలువులు సాధించారు. మొత్తంగా నాలుగేల్లలో 4,155 మంది కొలువులు సాధించారు.
గతేడాది 250.. ఈ ఏడాది 278..
నిట్ క్యాంప్ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేందుకు గతేడాది 250కిపైగా కంపెనీలు వచ్చాయి. ఈ ఏడాది 278 కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ కోసం నిట్‌కు వచ్చాయి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా అనాలసిస్, డేటాసైన్స్ డేటా ఇంజినీరింగ్, కన్సల్టెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఎంపికయ్యారు. గరిష్టంగా రూ.88 లక్షల ప్యాకేజీతో ఈసీఈ గ్రూప్ విద్యార్థి రవిషా కొలువు సాధించాడు. యూఎస్‌కు చెందిన సోర్బ్ అనే సాఫ్‌టేవర్ కంపెనీకి సెలక్ట్ అయ్యాడు. ఇక హైదరాబాద్‌లోని మరో సాఫ్ట్‌వర్ కంపెనీ క్యాంప్‌లోని ఈసీఈ విద్యార్థి మీత్ పోపాట్‌ను రూ.64 లక్షల భారీ ప్యాకేజీతో ఎంపిక చేసింది.
ఐఐటియన్లకు తగ్గుతున్న ప్యాజీలు..
ఇదిలా ఉంటే.. ఐఐటియన్ల వేతనాల్లో భారీగా కోత పడుతోంది. ఈమేరకు డెలాయిట్, టీమ్‌లీజ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది ఒకప్పుడు ఏడాదికి సగటు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉన్న ప్యాకేజీ ఇప్పుడు రూ.15 లక్షలు దాటడం కూడా కష్టంగా మారింది. ఐఐటీల్లో చదివిన వారిలో దాదాపు 40% మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగాలు దక్కడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ కాదని ఎలక్ట్రిక్ వెహికల్ రంగాల్లో పెట్టుబడులు కారణమని తెలుస్తోంది.
కొంప ముంచుతున్న ఏఐ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ కూడా ఐఐటీ విద్యార్థుల కొంప ముంచుతోంది. 2023–24 విద్యా సంవత్సరంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్ జీపీటీతోపాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం) కారణంగా ప్లేస్‌మెంట్ శాతం తగ్గుతోంది. దేశం మొత్తం 23 ఐఐటీ క్యాంస్‌లు ఉండగా ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థులు..
ఐఐటియన్లు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి ఇటీవల ఢిల్లీ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్తులకు ఉద్యోగాలు ఇస్తామని పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. తమ సంస్థల్లో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రెఫరెన్స్ ఇవ్వడంతోపాటు ఇంటర్న్‌షిప్‌ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.
చాట్ జీపీటీ ఎఫెక్ట్..
ఆర్థిక, సాంకేతిక కారణాలతోపాటు చాట్‌జీపీటీ కారణంగా ఐఐటియన్లకు ఉద్యోగాలు తగ్గాయని బిట్స్ గ్రూపు వైస్ ఛాన్స్‌లర్ వి. రాంగోపాల్‌రావు తెలిపారు. ప్రతీ ఐఐటీలో 20 నుంచి 30 శాతం ప్లేస్‌మెంట్లు తగ్గాయని పేర్కొన్నారు. చాట్‌జీపీటీతోపాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. వీటికారనంగా ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేస్తున్నారని తెలిపారు. దీంతో ప్లేస్‌మెంట్స్ తగ్గాయని తెలిపారు.