NIMR Recruitment 2021: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఎంటీఎస్ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్), ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత సబ్జెక్ట్ లో డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంటర్, ఐటీఐలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత రంగంలో తప్పనిసరిగా అనుభవం ఉండాలి.
https://nimr.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 15,850 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు వేతనంగా చెల్లించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అర్హత, అనుభవాన్ని బట్టి ఉద్యోగులకు వేతనం లభించనుంది.
తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువని చెప్పవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.