ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రూ.42,500 వేతనంతో ఉద్యోగాలు..?

నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 100 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 100 ఖాళీలలో 80 సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉండగా 20 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. Also Read: వర్క్ […]

Written By: Navya, Updated On : December 12, 2020 12:06 pm
Follow us on


నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 100 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 100 ఖాళీలలో 80 సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉండగా 20 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయి.

Also Read: వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం వెతుకుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 42,500 రూపాయలు వేతనం రూపంలో పొందవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 550 రూపాయలు కాగా ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ కాగా ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఒడిషా, జార్ఖండ్‌, ఢిల్లీలో విధులు నిర్వహించాలి.

Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగాలు..?

డిసెంబర్ 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. బీఈ లేదా బీటెక్ లో 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రకియ జరుగుతుంది. https://www.nbccindia.com/ వెబ్ సైట్ లో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ అడ్రస్ కు అభ్యర్థులు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.