
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 43 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఎన్ఏఎల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://nal.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 43 ఉద్యోగ ఖాళీలలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 19, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 6, టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 17, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీ 1, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 6, మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలు 3, డ్రాట్స్‌మెన్ ఉద్యోగ ఖాళీలు 2, టర్నర్ ఉద్యోగ ఖాళీలు 1, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 1, పెయింటర్ ఉద్యోగ ఖాళీలు 1, ఎలక్ట్రోప్లాటర్ ఉద్యోగ ఖాళీలు 1, షీట్ మెటల్ వర్కర్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.
ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 21వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా https://nal.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 55 శాతం మార్కులతో పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
బీఈ / బీటెక్ పూర్తిచేసి రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో విధమైన అర్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.