https://oktelugu.com/

డిగ్రీతో నాబార్డులో ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..?

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 162 మేనేజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుండటం గమనార్హం. త్వరలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. తాజాగా రిలీజైన నోటిఫికేషన్ ప్రకారం ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్, గ్రేడ్‌-బీ […]

Written By: , Updated On : August 3, 2021 / 08:14 AM IST
Follow us on

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 162 మేనేజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుండటం గమనార్హం. త్వరలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. తాజాగా రిలీజైన నోటిఫికేషన్ ప్రకారం ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్, గ్రేడ్‌-బీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

https://nabard.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. మొత్తం 162 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 155 ఉండగా మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 7 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు కనీసం 60 శాతం మార్కులతో కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది. ఏవైనా సందేహాలు ఉంటే నోటిఫికేషన్ ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

గ్రేడ్ బీ మేనేజర్ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్ పోస్టులకు పని చేయాల్సి ఉండగా గ్రేడ్‌-ఏ అసిస్టెంట్‌ మేనేజర్ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌, రాజ్‌భాష సర్వీస్‌, ప్రొటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి.