
మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 21 అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోకుండానే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నెల 21వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరవుతారో వారికి మొదట రాతపరీక్ష జరుగుతుంది. ఆ తరువాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. https://midhani-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 27,090 రూపాయలు వేతనంగా లభిస్తుంది.
అభ్యర్థులు జూన్ నెల 21వ తేదీన జరిగే ఇంటర్య్వూలకు brahm prakash dav school అడ్రస్ లో హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 7. 30 గంటల లోగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉండగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు డేట్ ఆఫ్ బర్త్, అనుభవం, ఈఎస్ఐ, ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌లకు సంబంధించిన ధ్రువపత్రాలను తమ వెంట తీసుకొని వెళ్లాలి.