Microsoft Data Center came to Hyderabad with the help of KTR: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను డిజిటల్ నగరంగా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కృషి చేస్తోంది. ఇందుకోసం సాంకేతిక పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు డేటా సెంటర్ తీసుకురావాలని ఎప్పటి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే మొత్తానికి కేటీఆర్ ఆనుకున్నది సాధించారు. రాజధానిలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు మైక్రోసాప్ట్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి మైక్రోసాప్ట్ క్యాంపస్ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాప్ట్ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి డేటా సెంటర్ ఏర్పాటును ప్రకటించారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.15 వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాప్ట్ పెట్టనుంది.
మైక్రోసాప్ట్ సంస్థ గతంలో సాప్ట్ వేర్ డెవలప్మెంట్ సెంటర్ ను హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. దీంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. దేశంలోని ఐటీ నగరాలతో హైదరాబాద్ కూడా పోటీ పడుతోంది. ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ పేరు మారుమోగింది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం వెనుకబడిన కారణంగా మొదటి స్థానాన్ని ఆక్రమించుకోలేకపోతుంది. దీంతో ఐటీ రంగంలో హైదరాబాద్ ను అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని కేటీఆర్ ఎప్పటి నుంచే సాంకేతికంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.
రెండు పర్యాయాలుగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సాంకేతికంగా యాక్టివ్ గా ఉంటారు. ఈ విషయంలో అస్సలు కాంప్రమైస్ కాలేరు. ఇందులో భాగంగా మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ కొన్ని ముఖ్య నగరాలను ఎంచుకుంది. ఇందులో హైదరాబాద్ కూడా ఉంది. అయితే హైదరాబాద్ లో కాకుండా తమ నగరాల్లో ఏర్పాటు చేయాలని కొందరు ఒత్తిడి పెంచారు. కానీ కేటీఆర్ చాకచక్యంతో డేటా సెంటర్ ను హైదరాబాద్లో నెలకొల్పేలా కృషిచేశారు. డేటా సెంటర్ కు అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవికి నిజంగానే నచ్చిందా ? లేక కాంప్రమైజ్ అయ్యాడా ?
ముఖ్యంగా డేటా సెంటర్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. సాధారణంగా మైక్రోసాప్ట్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ యాజమాన్యం అన్నీ పక్కగా ఉంటేనే ముందుకు సాగుతుంది. ఆ సంస్థలో తీసుకునే నిర్ణయాలు తేలికగా ఉండవు. కానీ కేటీఆర్ పట్టుబడి డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాప్ట్ విధించిన నిబందలన్నింటికొ ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా డేటా సెంటర్ ఏర్పాటు చేసే స్థలాన్ని స్వయంగా చూపించారు. అయితే కేటీఆర్ చొరవతో మైక్రోసాప్ట్ సంస్థ సంతృప్తి చెందింది. దీంతో డేటా సెంటర్ ఏర్పాటుకు వెంటనే అంగీకరించింది.
గతంలో మైక్రోసాప్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు తరువాత హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు డేటా సెంటర్ ఏర్పాటు తరువాత కూడా రాజధాని ఐటీ నగరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో డేటా సెంటర్ పెట్టాలని అదాని గ్రూప్ ఇప్పటికే నిర్ణయించింది. దాదాపు 13 బిలియన్ డాలర్ల వ్యయంతో డేటా సెంటర్ తో పాటు ఇన్ ప్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా మైక్రోసాప్ట్ సైతం ముందుకు రావడంతో హైదరాబాద్ పై ఆశలు విపరీతంగా పెరిగాయి. దీంతో మరికొన్ని కంపెనీలు సైతం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు.
Also Read: Bandi Sanjay: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కు భయపడుతున్న కేసీఆర్.. బండి సంజయ్ సంచలన కామెంట్స్