కేంద్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లను ఇస్తోంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇంటర్ పాసైన విద్యార్థులకు జాతీయ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియకు గడువు ముగియగా కేంద్రం దరఖాస్తు గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగించింది.
Also Read: పేద విద్యార్థులకు ఎల్ఐసీ శుభవార్త.. 20వేల రూపాయల స్కాలర్ షిప్..?
మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. జాతీయ స్కాలర్ షిప్ కు అర్హులైన విద్యార్థుల యొక్క జాబితాను https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో పొందుపరిచామని చెప్పారు. ఈ వెబ్ సైట్ లో పేర్లు ఉన్నవాళ్లంతా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగాలు..?
52,740 మంది విద్యార్థులు ప్రాథమికంగా ఈ స్కాలర్ షిప్ కు ఎంపికయ్యారు. https://scholarships.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే కేంద్రం విద్యార్థులకు స్కాలర్ షిప్ ఎంత ఇస్తుందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులు చదవలేని వాళ్లకు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం
ఇంటర్ తరువాత ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు విద్యార్థులు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ స్కాలర్ షిప్ లను అందిస్తోంది. దేశంలో వేల సంఖ్యలో విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ వల్ల ప్రయోజనం పొందుతున్నారు.