Ap Jobs: నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలలో ల్యాబ్ టెక్నీషియన్స్ 4, డీఆర్-టీబీ కౌన్సెలర్లు 1 , టీబీ – హెచ్‌వీ (ఎన్‌జీఓ పీపీ) 3, సీనియర్ ట్రీట్‌మెంట్ సూజర్ వైజర్ 1, సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబ్ సూపర్ వైజర్లు 4 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఇంటర్, డిప్లొమా, సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్, ఓపీ నెం 36, సెంట్రల్ హాస్పిటల్ క్యాంపస్, కర్నూలు అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి.
Also Read: విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.36,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్?
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు అనుభవం కూడా ఉండాలి. అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://kurnool.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
Also Read: మచిలీపట్నం బెయిల్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్.. భారీ వేతనంతో?